జూబ్లీహిల్స్ లో 512 లీటర్ల మద్యం..  2 కోట్ల 83 లక్షలు సీజ్

BB6 TELUGU NEWS CHANNEL
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. ఇప్పటివరకు 2 కోట్ల 83లక్షల నగదు ..512 లీటర్ల మద్యం సీజ్ చేసిన అధికారులు.

నియోజకవర్గంలో 45 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 45 స్టాటిక్ సర్వెలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు . ఈ బృందాల వాహనాలకు జీపీఎస్, పీటీజెడ్ కెమెరాలను అమర్చి, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు.

అక్టోబర్ 24తో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిపోగా..జూబ్లీహిల్స్ బరిలో 58 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్,బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్, జూబ్లీహిల్స్ లో గెలవాలని అధికార పార్టీ, సత్తాచాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు పోలింగ్ .. 14న కౌంటింగ్ జరగనుంది.

జూబ్లీహిల్స్ లో మొత్తం 4,లక్షల 13 వందల 65 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు – 2 లక్షల ఎనిమిది వేల 561.. లక్షా 92 వేల 779 మహిళల ఓట్లు,25 ఇతరుల ఓట్లు ఉన్నాయి .నియోజకవర్గంలోని మొత్తం 407 పోలింగ్ కేంద్రాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా, వీటిలో54 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.పోలింగ్ రోజున ఈ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe