BB6 TELUGU NEWS CHANNEL : మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన కామారం నవనీత అనే అమ్మాయి నీట్ మొదటి దశలో ఎంబిబిఎస్ సాధించి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అమ్మాయి వాళ్ళ కుటుంబం పేదరికంతో రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వాళ్లది కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు ప్రస్తుతం పూరి గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు.గండీడ్ మండల కేంద్రంలో ఆర్థిక సహాయం అందించిన ఉమ్మడి జిల్లా మరియు వివిధ మండలాల నాయకులు అమ్మాయిని ఈరోజు సన్మానం చేసి 31 వేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అమ్మాయి మాట్లాడుతూ నేను వైద్య విద్యలో రాణించిన తర్వాత పేద ప్రజలకు సేవ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ అమ్మాయిని ఆదర్శంగా తీసుకొని బడుగు బలహీన వర్గాల పిల్లలు అందరు కూడా బాగా చదువుకోవాలని ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలని వివిధ పార్టీల నాయకులు సంఘాల నాయకులు విద్యావంతులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి ఉమ్మడి గండీడ్ మండలం మాజీ ఎంపీపీ శాంతి రంగ్యా, మండల పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, గండీడ్ మండల ఎంఈఓ రుద్రారం జనార్ధన్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కప్లాపూర్ ఆశన్న, ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, గండీడ్ మండల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు గుముడాల చెన్నయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కామి వెంకటరాములు, మధు గౌడ్,అంబెడ్కర్ సంఘం మండల అధ్యక్షులు హస్నాబాద్ వెంకటయ్య, ఎంఆర్పిఎస్ మండల అధికార ప్రతినిధి జె.వివేకానంద్, కొడంగల్ నియోజకవర్గ అంబెడ్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి గౌరగల్ల కృష్ణ మౌర్య, లెక్చరర్ ర్యాకం కేశవులు, మరికల్ వెంకట్రాములు, చాకలి శ్రీనివాస్, మైసగల్ల రాము రావణ్ ధర్మ, టీచర్ గోపాల్, జనార్ధన్, శంకర్, కేశవులు, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.


