BB6 TELUGU NEWS CHANNEL
మంగళవారం మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం లో బి.సి.వసతి గృహం,గిరిజన సంక్షేమ శాఖ మినీ గురుకుల పాఠశాల,అంగన్ వాడి కేంద్రాలు కలెక్టర్ విజయేందీర బోయి తనిఖీ చేసిన క్రమంలో మండలం లోని గిరిజన సంక్షేమ మినీ గురుకుల బాలికల పాఠశాల లో మధ్యాహ్న భోజనంకు వండిన భోజనాన్ని పరిశీలించి పప్పు, చారు ఒకటే లాగా ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉదయం మెనూ ప్రకారం పెట్టారా? అని అడిగారు మెనూ ప్రకారం ఉదయం ఇడ్లీ కి బదులుగా టమాటా రైస్ పెట్టారని హెడ్ మాస్టర్ వివరించారు.
ఇడ్లీ పిండి లేనందున సరఫరా కానందున టమోటా రైస్ పెట్టినట్లు తెలిపారు. పిల్లలకు స్వచ్ఛమైన, రుచికరమైన ఆహారం అందించాలని ఆహారం వండే సిబ్బంది జాగ్రత్తగా పరిశుభ్రంగా ఆహార పదార్థాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని కలెక్టర్ గారు అడిగారు.
ఎం.పి.డి. ఓ.ను పర్యవేక్షణ చేయాలని ప్రత్యేకంగా ఆదేశించారు. బుధవారం ఎంపీడీవో మరియు ఎంఈఓ మధ్యాహ్న భోజనంలో పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఎంపీడీవో హరీష్ రెడ్డి ఇచ్చిన వివరాల ప్రకారం ఈరోజు మెనూ ప్రకారం చికెన్ రైస్ పెరుగు అన్ని కరెక్ట్ గా ఉన్నాయని భోజనం కూడా బాగుందని తెలిపారు.
