మహాత్మా గాంధీ యూనివర్సిటీ పర్యటనలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

BB6 TELUGU NEWS CHANNEL
మహాత్మా గాంధీ యూనివర్సిటీకి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించారు. వైస్‌ఛాన్సలర్‌తో పాటు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బి.ఎస్. మూర్తి సమక్షంలో గవర్నర్ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీసులు ఘన స్వాగతం పలికారు.తదుపరి గవర్నర్ కాన్వొకేషన్ మీటింగ్ వేదికకు చేరుకున్నారు. అనంతరం విద్యార్థులకు పీహెచ్‌డీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు తమ భవిష్యత్తు జీవితాలను సువర్ణ భవిష్యత్తుకు బాటగా మార్చుకొని, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తదితరులు హాజరయ్యారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe