వెన్నచేడు గ్రామంలో తల్లి పాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం
వెన్నచేడు గ్రామంలో తల్లి పాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత్ చెన్నయ్య పాల్గొని, నవజాత శిశువులకు తల్లి పాలు అమృతంతో సమానమని, పుట్టిన మొదటి గంటలోనే తల్లి పాలను ప్రారంభించడం మరియు మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వడం వల్ల శిశువుల ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని వివరించారు. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఆరోగ్య శాఖ సూచనలు పాటిస్తూ తల్లి పాల ప్రాముఖ్యతను గుర్తించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విలేజ్ సెక్రటరీ చెన్నకేశవులు , జీపీఓ శ్రీనివాస్ , అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, గర్భిణీ స్త్రీలు, చిన్నారుల తల్లులు పాల్గొని తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలందరూ తల్లి పాల ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి శిశువుకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు.