BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా వరుణ యాగాలు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు.
హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో 47 దేవాలయాలకు చెందిన 191 మంది అర్చకులు, వేద పండితులు, పరిచారకులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
“తెలంగాణలో వర్షాలు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. వరుణ దేవుడి కరుణ కోసం త్వరలోనే హైదరాబాద్లో అధికారికంగా వరుణ యాగం నిర్వహిస్తాం. అన్ని ప్రముఖ దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులచే వరుణ జపాలు చేయిస్తాం” అని తెలిపారు.
అలాగే దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న థర్డ్ గ్రేడ్ EO పోస్టులను వచ్చే వారంలో భర్తీ చేస్తామని, ఆలయాల నిర్వహణను మరింత పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా వరుణ యాగాలకు సర్వం సిద్ధం : మంత్రి కొండా సురేఖ
08
Aug