BB6 TELUGU NEWS CHANNEL
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెలలో కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జులై 25 నుంచి ఆగస్టు 10 వరకు అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ఆదేశించారు.
ఆ గడువు నేటితో ముగుస్తుండటంతో.. ఈరోజు ఉదయం నుంచే మీ-సేవ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ప్రజలు బారులు తీరారు. చాలా చోట్ల సర్వర్ సమస్యలు, రద్దీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కొత్తగా పెళ్లయిన జంటలు, విడిపోయిన కుటుంబాలు, గతంలో అప్లై చేసుకుని పెండింగ్ లో ఉన్నవారికి ఈసారి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కార్డులు పంపిణీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది.
మరి గడువు తర్వాత అప్లై చేసుకోని వారి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం మరోసారి గడువు పొడిగిస్తుందా? అనేది వేచి చూడాలి.
ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం BB6 తెలుగు న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది BB6 బ్రేకింగ్ న్యూస్.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి నేడు ఆఖరి రోజు.. హడావిడిగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో రేషన్ కార్డుల పంపిణీ
10
Aug