ఆ గ్రామంలో అందరూ ఆణిముత్యాలే ఉపాధ్యాయులుగా ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర

మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామంలో 1965 మే 27న వనపల్లి జంబులయ్య పద్మమ్మలకు నలుగురు సంతానం  కాగా మొదటి బిడ్డగా వనపల్లి నిరంజన్ జన్మించారు. వెన్నచెడ్ గ్రామంలోనే పదవ తరగతి పూర్తి చేసి ఇంటర్ కోస్గిలో ,డిగ్రీ వికారాబాద్ లో ,Msc ఉస్మానియా లో, B.ed మహబూబ్నగర్ లో పూర్తి చేశారు. మొదటగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం గడిసింగాపూర్ గ్రామంలో 1989 లో ఉపాధ్యాయులుగా బాధ్యతలను స్వీకరించి తరువాత హైదరాబాద్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మణికొండలో 2014లో ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలను స్వీకరించారు. ఆ సమయంలో అక్కడ విద్యార్థుల సంఖ్య కేవలం 450 కాగా అప్పటినుండి విద్యా వికాసమే లక్ష్యం గా నిరంతర శ్రమతో అంకిత భావంతో సమర్థ నాయకత్వంతో పాఠశాలను నడిపించి నందుకు గాను ప్రస్తుతం 1400 వందల మంది విద్యార్థుల సంఖ్యకు చేరుకోవడం జరిగింది.దీనికి కృషి చేసినందుకు గాను పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వి.నిరంజన్ గారిని గుర్తించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిచే సన్మానించడం జరిగింది.ఉపాధ్యాయులుగా ఘనమైన కీర్తిని గౌరవాన్ని దక్కించుకున్న నిరంజన్ గారిని ఘనంగా సన్మానించిన వెన్నచెడ్ గుర్రాల చెన్నయ్య.

వనపల్లి నిరంజన్ గారిని సన్మానించిన గొర్రెల చెన్నయ్య
Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe