హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు దరఖాస్తుల ఆహ్వానం.

BB6 TELUGU NEWS CHANNEL
ఇబ్రహీంపట్నం రూరల్: పబ్లిక్ స్కూల్ రామంతాపూర్, బేగంపేటలో 1వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
లంబాడ -4,
ఎరుకల – 1,
ఇతర గిరిజన తెగలు-1
(బాలురు 3,బాలికలు 3) చొప్పున ఖాళీలు ఉన్నట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు చెందినవారై ఉండాలని, తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు లోపు ఉండాలన్నారు. కులం, ఆదాయం, నివాస, జనన ధ్రువీకరణపత్రాలు జతపర్చాలని చెప్పారు. ఈ నెల 12నుంచి 18వ తేదీ వరకు కలక్టరేట్లోని జిల్లా గిరిజనాభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు లభిస్తాయన్నారు. అభ్యర్థి 1 జూన్ 2019 నుంచి 31 మే 2020 మధ్య కాలంలో జన్మించి ఉండాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులు గిరిజనాభివృద్ధి కార్యాలయంలో ఈ నెల 18 సాయంత్రం 5 గంటల లోపు పంపించాలన్నారు. ఈనెల 22న మధ్యాహ్నం 3 గంటలకు లాటరీ విధానం ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe