గండీడ్ లో సమ్మర్ క్యాంప్ ని ప్రారంభించిన MRO బ్రహ్మరవుతూ మల్లికార్జునరావు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని
పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ని మండల తహసిల్దార్ మల్లికార్జున్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 11,మే,2026 నుండి 25 మే 2026 వరకు 15 రోజులపాటు వేసవి శిబిరం నిర్వహించబడుతుందని మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థినీ విద్యార్థులు ఈ అవకాశాన్ని  ఉపయోగించుకొని క్రీడలు పట్ల ఆసక్తిని,నైతిక విలువలు పెంపొందించుకోవాలని కోరారు .
ఈ కార్యక్రమం లో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు వి. జనార్దన్, గ్రామ సర్పంచ్ భగవంతు రెడ్డి, పీడీ రాములు, శివకుమార్, సత్తయ్య పాల్గొన్నారు.