రెయిన్ అలర్ట్ తెలంగాణలో 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్..

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో నిన్నటి నుంచి పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి,అల్పపీడం కారణంగా మరో రెండురోజులు వర్షాలు పడే అవకాశ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఫిబ్రవరి 24న దాదాపు 23 జిల్లాలకు వర్షసూచన చేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలుల తీవ్రత గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉందని తెలిపింది.
రేపు అదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల,నిజామాబాద్, కామారెడ్డి, మెదక్,సంగారెడ్డి,వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట,మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్,నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ల తీవ్రత ఉండే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారి చేసింది. ఫిబ్రవరి 25న నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత వర్షాలు తగ్గు ముఖం పట్టే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe