బాన్సువాడలో చోరీ..SBI బ్యాంక్ నుంచి 8 లక్షలు డ్రా చేసి..రిలయన్స్ మార్కెట్ కు వెళ్లొచ్చే లోపు..

BB6 TELUGU NEWS CHANNEL
కామారెడ్డి జిల్లా: బాన్సువాడలో సినీఫక్కీలో చోరీ జరిగింది. SBI బ్యాంక్ నుంచి 8 లక్షలు డ్రా చేసి రిలయన్స్ మార్కెట్ కు మాధవరావు అనే వ్యక్తి వెళ్లాడు. కారులో డబ్బులు పెట్టి రిలయన్స్ మార్కెట్ లోకి మాధవరావు వెళ్లడాన్ని పక్కా రెక్కీ చేసిన దొంగలు గమనించారు. కారు అద్దాలు పగుల కొట్టి 8 లక్షల రూపాయల డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారు.

రిలయన్స్ మార్కెట్లో లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి కారు అద్దాలు పగలగొట్టి ఉండటాన్ని మాధవ రావు గమనించాడు. కారు లోపల డబ్బులు లేవన్న విషయం గ్రహించి లబోదిబోమని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దొంగతనం జరిగిన స్పాట్ లో సీసీకెమెరాలను చెక్ చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దొంగల కోసం పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe