BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో గాంధీజీ చిత్రపటానికి పూల దండ వేసి నివాళులర్పించడం జరిగింది. గాంధీజీ వర్ధంతి సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణ దేవి మాట్లాడుతూ గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఇతను గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 02న కరంచంద్ గాంధీ పుత్లిబాయి దంపతులకు జన్మించాడు. గాంధీజీ తండ్రి పోరుబందర్ సంస్థానంలో ఒక దివాన్ గా పని చేసేవారు గాంధీజీ ప్రాథమిక విద్య రాజ్కోట్ లో ఉన్నత విద్య కతియవాడ్ పట్టణంలో పూర్తి చేశారు అనంతరం ఉన్నత చదువులు నిమిత్తం దక్షిణ ఆఫ్రికా వెళ్లారు తెల్లవారిపై మొదటిసారిగా అక్కడి నుంచే పోరాటం మొదలుపెట్టారు. 1915 జనవరి 9న భారతదేశానికి తిరిగి వచ్చి స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. యావత్ దేశాన్ని ఏకతాటి పైకి తీసుకొచ్చి శాంతి అహింస అని మార్గంలో పోరాటం చేస్తూ స్వాతంత్రం సిద్ధించడంలో కీలకపాత్ర పోషించిన గొప్ప మహనీయుడు. ఇతను 1948 జనవరి 30 తారీకు రోజు నాథూరామ్ గాడ్సే చేతిలో చనిపోయాడు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణ దేవి, ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య,కె.వెంకటయ్య, మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా మహాత్మా గాంధీ 78వ వర్ధంతి
30
Jan