గండీడ్ మండలం FPC మహిళా రైతు ఉత్పత్తి దారుల సంఘం గండీడ్ ఐకెపి ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. NAFED సంస్థ వారి నుండి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ (A గ్రేడ్) రు ₹8000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది.
ఈ ప్రారంభోత్సవంలో పరిగి శాసనసభ్యులు T. రామ్మోహన్ రెడ్డి , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి , DPM అరుణ , రవి ఏపీఎం , గండిడ్ మండల ఏపీఎం రజిత , మండల వ్యవసాయ అధికారి రాధమ్మ , FPC గండిడ్ అధ్యక్షురాలు మాధవి , కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందులు కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు బాధ్యత తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లలిత , గండిడ్ గ్రామ సర్పంచ్ ర్యాగరి భగవంత్ రెడ్డి , గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి , చెన్నారెడ్డి , అనంత లక్ష్మారెడ్డి, నర్సింహా రెడ్డి , మహిళా సంఘాల సభ్యులు, మండల సమాఖ్య CC లు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.

