మొదటిరోజు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ విజయవంతం.

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మండలంలోని 50 శాతం ప్రైమరీ స్కూల్ టీచర్స్ కు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. మీటింగ్లో భాగంగా స్థానిక ఎంఈఓ రుద్రారం జనార్ధన్ మాట్లాడుతూ ప్రాథమిక దశ విద్యార్థులకు చతుర్విధ ప్రక్రియలు కచ్చితంగా రావాలని మరియు ఎఫ్.ఎల్.ఎన్  ఇంప్లిమెంటేషన్ చేయాలని  మాట్లాడారు.పాఠశాలల వారిగా సమ్మేటివ్ అసెస్మెంట్ వన్ ఫలితాల గురించి ఉపాధ్యాయులతో చర్చించడం జరిగింది. అదేవిధంగా AXL కంప్యూటర్ ఆధారిత బోధన గురించి వచ్చే ఫలితాల గురించి AXL అమలు అవుతున్న పాఠశాల ఉపాధ్యాయుల నుండి మాట్లాడించడం జరిగింది.
తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ ఫీడ్ బ్యాక్ గురించి కూడా చర్చించారు.
కార్యక్రమంలో ఎంఈఓ రుద్రారం జనార్ధన్, సల్కర్ పేట్ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ విజయ లక్ష్మి, వెన్న చేడ్ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ రవి బాబు, ఆర్.పి సంజీవ రెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్.కిషన్ ఎల్.సేవియా, అంగడి అరుణదేవి,మంజుల, భారతి, పి.ఆర్.టి.యు టిఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, టిఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య,
టి.పి.ఆర్.టి.యు మండల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, సిపిఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య, టిజియుఎస్ మండల అధ్యక్షులు రవీందర్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ మిగతా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పిలు అపర్ణ , వసంత పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe