ప్రెస్ మీట్ నిర్వహించిన అంబేద్కర్, భవన నిర్మాణ కార్మిక, MRPS, ప్రజాసంఘాల నాయకులు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన అంబేద్కర్, భవన నిర్మాణ కార్మిక, MRPS,ప్రజాసంఘాల నాయకులు..రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన చంద్ర శేఖర్ అనే అబ్బాయి  బీసీ సామాజిక వర్గానికి చెందిన భవాని అనే అమ్మాయిని కులంతర ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. దీనిని మనసులో పెట్టుకొని అమ్మాయి వాళ్ళ తండ్రి మరియు బంధువులు అబ్బాయి వాళ్ళ అన్న రాజశేఖర్ ను ఇంటి నుండి కిడ్నాప్ చేసి కార్ లో మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం ఎన్మన్ గండ్ల గ్రామ సరిహద్దులో గల అటవీ ప్రాంతంలో బైండింగ్ వైర్ తో కాళ్లు చేతులు బంధించి పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం జరిగింది. రాజశేఖర్ ను అతి కిరాతకంగా చంపిన 8 మంది వ్యక్తులను  ఎన్కౌంటర్ చేయాలని ఈరోజు గండీడ్ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించి బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని అంబేద్కర్  ప్రజా సంఘాల నాయకులు డిమాండు చేస్తున్నారు.  కార్యక్రమంలో స్థానిక మాజీ ఎంపీటీసీ చిట్లపల్లి బాలయ్య, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కప్లాపూర్ మాజీ ఎంపిటిసి ముశ్రీఫ ఆశన్న, ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, రంగారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ కుందేటి కిష్టయ్య,సీనియర్ నాయకులు చిట్లపల్లి మల్కయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గుముడాల చెన్నయ్య, గండీడ్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు హాస్నాబాద్ వెంకటయ్య, డప్పు కళాకారుల సంఘం మండల గౌరవ అధ్యక్షులు హస్నబాద్ చంద్రయ్య, సీనియర్ సెంట్రింగ్ మేస్త్రి చెన్నప్ప,వేపూరి నర్సింలు, వేపూరి నర్సింలు (చింటు అన్న)చిన్నవార్వాల్ అంబేద్కర్ సంఘం నాయకులు కట్టెల శంకర్, కట్టెల దస్తయ్య, దొబ్బలి దస్తయ్య,రాజు, బోక్కి కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe