‘నకిలీ’ క్లిప్పులను పాతరేసిన పబ్లిక్ ..ఫలించని సోషల్ మీడియా మంత్రాంగం
BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్: ఫేక్ క్లిప్పులతో జనాన్ని తప్పుదోవ పట్టించే ఎత్తులు జూబ్లీహిల్స్ లో పనిచేయలేదు.. పెయిడ్ సర్వేలతో మైండ్గేమ్ ఆడాలని చూసిన బీఆర్ఎస్ కు ఓటరు తగిన గుణపాఠం చెప్పాడు.కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ‘ రికార్డు మెజార్టీ సాధించారు. 16 ఏండ్ల తర్వాత జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నకిలీ క్లిప్పింగులను తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టినా ఫలితం దక్కలేదు. దీంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా డీలా పడిపోయింది.
కాంగ్రెస్ చేతులెత్తేతసిందని పేర్కొంటూ వీడియోలు క్రియేట్ చేసినా ఆ పార్టీకి ఓటరు కర్రు కాల్చి వాత పెట్టాడు. వెలుగుదినపత్రిక పేరుతో పుంఖాను పుంఖాలుగా పత్రికా క్లిప్పులను తయారు చేశారు. వార్త వెలుగు అని మరోటని పేర్కొంటూ మంత్రుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంచేశారు. చివరి అస్త్రంగా మంత్రి తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయాలని చెప్పినట్టు ఓ క్లిప్పింగ్ తయారు చేసి పోస్ట్ చేశారు.ఈ ఎత్తులన్నింటినీ జనం చిత్తు చేశారు.అభివృద్ధికి పట్టం కట్టారు. అధికార పార్టీకి విజయం చేకూర్చారు.
Related News
BB6 TELUGU NEWS CHANNEL యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య వివాదం ఘర్షణకు దారి తీసిం...
Continue reading
BB6 TELUGU News CHANNEL తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం! రాష్ట్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. వచ్చే నెల 3వ తేదీ తర్వాత ఢిల్లీలో...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL వరంగల్ లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జీవో నంబర్ 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేస్తున్న ని...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైందంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కొన్ని మీడి...
Continue reading
ముదిరాజ్ల ఆరాధ్య దైవం పండుగ సాయన్నకు తెలంగాణ ప్రభుత్వం ఘన గౌరవం
BB6 TELUGU NEWS CHANNEL ముదిరాజ్ల ఆరాధ్య దైవం,...
Continue reading
బకాయిలు కట్టకుంటే మిల్లులు స్వాధీనం - సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలో ర...
Continue reading
పేద పిల్లల కలలకు రెక్కలు - యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్
BB6 TELUGU NEWS CHANNEL పేద పిల్లల కలలకు యంగ్ ఇండియ...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లకు షాక్ ఇచ్చింది. ...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL *🔊ఇకపై తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు**🔶ఇంటర్ బోర్డు ఇక కనుమరుగు!**🔷ఒకే గొడుగు కిందకు స్కూల్, ఇంటర్ విద్య**🔶న్యాయశాఖ పరిశీలనలో విలీన...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రం ప్రభుత్వ కళాశాలలో PACS చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి ని, వైస్ ఛైర్మన్ కమతం విష్ణువర్ధన్ రె...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు K M నారాయణ పై కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL “అందెశ్రీ.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కవిగా, గాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా పరిచయం ఉండొచ్చు.. కానీ నాకు మాత్రం ఉద్యమకారుడే కాదు.....
Continue reading
ఫేక్ సర్వేలతో మైండ్ గేమ్స్ పోల్ సర్వేల పేరుతో పకడ్బందీగా ఆడిన మైండ్ గేమ్ కూడా గులాబీ పార్టీని గట్టెక్కించలేదు పోయింది. జనం తమవైపే ఉన్నట్టు ప్రచారం చేశారు. కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోలను భారీ గా ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రచారాన్ని రక్తి కట్టిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కేకే సర్వే వర్కవుట్ అవుతుందని భావించినా అదీ గట్టెక్కించలేదు.
జూబ్లీహిల్స్ గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది: సీఎంరేవంత్ రెడ్డి
ఐఐటీ కాన్పూర్ తో సర్వే చేయించినట్టు మరో ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారు.భారీ మెజార్టీ పక్కా అంటూ సామాజికమాధ్యమాల్లో తిప్పారు. ఇంత చేసినా బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవి చూసింది.
రెండోసారీ సింపథీ పని చేయలే..
దుబ్బాక, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ లలో బీఆర్ఎస్ కు సింపథీ పనిచేయలేదు.కేవలం నాగార్జున సాగర్ లో మాత్రమే నోముల నర్సింహయ్య మరణం తర్వాత ఆపార్టీ నుంచి బరిలోకి దిగిన నర్సింహయ్య కుమారుడు భగత్ విజయం సాధించారు.అది కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉండటం వల్లే సాధ్యమైంది.
Views: 63