BB6 TELUGU NEWS CHANNEL
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల పరిధిలోని దుర్కి గ్రామంలోని ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ (PACS)లో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరానికి సహకార వారోత్సవాల ఇతివృత్తం *”సహకార సంస్థల ద్వారా ఆత్మనిర్భర్ భారత్”గా నిర్ణయించబడింది. ఈ సందర్భంగా PACS కార్యాలయంలో సహకార పతాకాన్ని *PACS చైర్మన్ దివిటి శ్రీనివాస్ యాదవ్* ఆవిష్కరించారు. కార్యక్రమంలో *PACS డైరెక్టర్లు పి. శ్రీనివాస్, జె. గంగారాం, డి. రాజు, రాములు, PACS సెక్రటరీ ఎస్. సుధాకర్ తో పాటు గ్రామప్రజలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.*
ఈ సందర్భంగా మాట్లాడిన *చైర్మన్ శ్రీనివాస్ యాదవ్* మాట్లాడుతూ, సహకార సంస్థలు గ్రామీణాభివృద్ధికి వెన్నెముకలా పనిచేస్తాయని, రైతుల ఆర్థిక అభివృద్ధికి PACSలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో సహకార వ్యవస్థ మరింత బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
72వ అఖిల భారత సహకార వారోత్సవాలు – నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి PACSలో సహకార పతాక ఆవిష్కరణ
15
Nov