వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ

BB6 TELUGU NEWS CHANNEL
ప్రభుత్వం ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ అన్నారు.ఆదివారం ఉమ్మడి గండీడ్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో  మహమ్మదాబాద్ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రజా ప్రతినిధులు,  నాయకులు,అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. వరి ధాన్యానికి క్వింటాలుకు 2,389 రూపాయల మద్దతు ధరతో పాటు సన్న రకం వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ను ప్రభుత్వం అందజేస్తుంది. రైతులు ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని  పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ అన్నారు .  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కమతం విష్ణువర్ధన్ రెడ్డి, మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కే.ఎమ్. నారాయణ, మాజీ ఎంపీపీ శాంతి రంగ్య,రామ్ లాల్, ఏవో నరేందర్,ఏపీఎం నర్మదా, ఏఈఓ మౌనిక తదితరులు పాల్గొన్నారు

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe