2 నెలలుగా 9 ఊర్లకు భగీరథ నీళ్లు ఆపి రాజకీయం చేస్తున్నా పట్టించుకోని అధికారులు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం రంగారెడ్డిపల్లి గ్రామం సమీపాన ఉన్న వాగులో మిషన్ భగీరథ పైప్ లైన్ అధిక వర్షాల వల్ల రెండు నెలల క్రితం తెగిపోయింది వాస్తవమే కానీ. నెల క్రితము గ్రామాల వారు మిషన్ భగీరథ నీళ్లకు ఇక్కట్లు పడుతున్నారని తెలుసుకున్న కలెక్టర్ గారు యుద్ధ ప్రాతికన చర్యలు తీసుకొని వెంటనే పునరుద్ధరణ చేయాలని ఆదేశించడం జరిగింది. ఇక్కడే రాజకీయం పునుముకుంది. సల్కార్పేట్ గ్రామానికి చెందిన గిరమోని తిరుపతయ్య అనే వ్యక్తి లైన్మెన్ గా విధులు నిర్వహిస్తుండగా అతనిపై ఉద్యోగరీత్యా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకొని వేరే వ్యక్తికి లైన్మెన్ గా నియమించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ లైన్ గిరమోని లింగం అనే వ్యక్తి పొలం నుండి వేయడం జరిగింది. ప్రస్తుతం లైన్మెన్ గా విధుల్లో నిర్వహించిన విరమొని తిరుపతయ్య లింగం కు బంధువు అవడంతో అన్యాయంగా విధుల్లో నుంచి తొలగించారు అనే నెపంతో ఇప్పుడు లింగం ను అడ్డుగా తన పొలంలో నుండి పైప్లైన్లు తీసివేయాలని పునరుద్ధరణ పనులకు అడ్డు వేస్తున్నారు.
ప్రస్తుతం గిరమోని తిరుపతయ్య అనే వ్యక్తి ఒక్కడి స్వార్థం వల్ల అతను టిఆర్ఎస్ పార్టీ వ్యక్తి కావడం వల్ల అతన్ని విధుల్లో నుంచి తొలగించారు అనే సాకుతో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కారణంగా కక్షపూరితంగా మంచినీటిని 9 ఊర్లకు ఆపడం జరిగింది.

రంగారెడ్డిపల్లి , కపులాపురం , గొల్ల గడ్డ , జానంపల్లి , గోవిందుపల్లి , గోవిందపల్లి తాండ , లింగాయపల్లి , వెన్నచెడ్ గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు ఆపడం వల్ల 20,000 మందికి పైగా మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
బోర్వెల్ , చెరువు నీళ్లు వాడడం వల్ల చెరువు వ్యాధులు గొంతు సంబంధిత వ్యాధులు జలుబు తో రోగాల బారిన పడుతున్నారు.
అధికారులు పార్టీ నాయకులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొని నీటి ఎద్దడిని నివారించే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe