AUSvsIND: ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌

BB6 TELUGU NEWS CHANNEL
క్వీన్‌లాండ్: ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్‌ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అతిథ్య జట్టు.. 119 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (30)టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సుందర్‌ 3, అక్షర్‌ 2, శివమ్‌ 2 వికెట్లు తీశారు. అర్ష్‌దీప్‌, బుమ్రా, వరుణ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  ఈ సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.