బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ప్రజా సంఘాలు

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన గజ్జి వెంకటయ్య వారం రోజుల క్రితం హార్ట్ ఎటాక్ తో చనిపోవడం జరిగింది. అతని కుటుంబం భార్య మరియు ముగ్గురు పిల్లలు వాళ్ళ అమ్మ అందరు కూడా పేదరికంతో  ఇంటి యజమాని  లేని అనాధలుగా బాధలో ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మరియు నాయకులు అందరు కలిసి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని జిల్లా వాట్సాప్ గ్రూప్లో చర్చించడం వల్ల ఎవరికి తోచిన అమౌంటు వారు జమ చేసి ఈరోజు సాయంత్రం స్థానిక కుల్కచెర్ల మండల నాయకులు మరియు ఘనపూర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులకు 11వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నాగని వెంకట్ రాములు, కప్లాపూర్ మాజీ ఎంపిటిసి ఎం.ఆశన్న, వికారాబాద్ జిల్లా PSHM  అధ్యక్షులు తుప్పలి ఆనంద్, ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, వికారాబాద్ జిల్లా స్వేరోస్ ఉపాధ్యక్షులు సాల్వీడ్ వెంకటేష్, గండీడ్ మండల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు గుముడాల చెన్నయ్య, గండీడ్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు హాస్నాబాద్ వెంకటయ్య, గండీడ్ మండల ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి రంగారెడ్డిపల్లి జె.వివేకానంద్, కుల్కచర్ల మండలం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు ఇప్పయిపల్లి మొగులయ్య, గండీడ్ అశోక్, గజ్జి కృష్ణ, చందు  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe