BB6 TELUGU NEWS CHANNEL
AP and Telangana Weather Forecast Update: తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. వర్షం జోరుగా, తిన్నగా కురుస్తోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే మేఘాలు.. ఇక్కడ కురుస్తున్నాయి. మరి ఈ శనివారం ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటేసింది. ప్రస్తుతం ఇది ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పై ఉంది. చాలా పెద్దగా ఉంది. 3 రాష్ట్రాల సైజులో ఉంది. ఇది ఇలా తిరుగుతూ.. ఈ రోజంతా తెలుగు రాష్ట్రాల పై ఉంటుంది. రాత్రికి మహారాష్ట్ర వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇవాళ ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలకు ఛాన్స్ కనిపిస్తోంది. మరి దీనిపై భారత వాతావరణ శాఖ (IMD) తన బులిటెన్‌లో ఏం చెప్పిందో చూద్దాం.
ఇవాళ ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి అని IMD చెప్పింది. అక్కడక్కడా భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పింది. తెలంగాణలో ఇవాళ (శనివారం) అతి భారీ వర్షాలు (very heavy rainfall) కురుస్తాయి అని చెప్పింది. అలాగే.. 5 రోజులపాటూ.. తెలంగాణ, యానాంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. రాయలసీమలో 5 రోజులపాటూ.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
ఇవాళ తెలంగాణలో రోజంతా మేఘాలుంటాయి. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉంటాయి. కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది. రాత్రికి తెలంగాణ నుంచి అల్పపీడనం మహారాష్ట్రవైపు వెళ్తుంది. అందువల్ల వర్షం తగ్గుతుంది.
ఏపీలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉదయం నుంచి రాత్రివరకూ కురుస్తాయి. రాత్రి 8 తర్వాత వర్షం తగ్గిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. రాయలసీమలో మాత్రం మేఘాలు ఉంటాయి తప్ప వర్షం పడే అవకాశాలు తక్కువ. ఒకట్రెండు చోట్ల తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉంది. అల్పపీడనం ఎటు వెళ్తుంది అనే దాన్ని బట్టీ.. వర్షం పడే అవకాశాలు కూడా మారుతుంటాయి. ఐతే.. అది రాయలసీమవైపు వెళ్లకపోవడం వల్ల అటు వర్షాలు తక్కువగా ఉంటున్నాయి
అరేబియా సముద్రంలో గంటకు 33 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది. బంగాళాఖాతంలో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది. ఏపీలో గంటకు 23 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 21 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అల్పపీడనం తీరం దాటినా.. బలంగానే ఉంది. అందువల్ల గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. ఇవాళ తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈదురుగాలులతో జాగ్రత్తగా ఉండాలి.
ఉష్ణోగ్రత చూస్తే.. తెలంగాణలో 23 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇవాళ తూర్పు రాయలసీమలో కొంత వేడిగా ఉంటుంది. తేమను చూస్తే.. పగటివేళ తెలంగాణలో 87 శాతం, ఏపీలో 74 శాతం ఉంటుంది. రాత్రికి తెలంగాణలో 89 శాతం, ఏపీలో 84 శాతం ఉంటుంది. అంటే.. ఇవాళ పగలు, రాత్రి కూడా వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చు.
ఈ రోజు ప్రయాణాలు పెట్టుకోకపోవడమే మేలు. చాలా చోట్ల రోడ్లు గతుకులు, బురదతో ఉంటాయి. వాహనాల టైర్లు స్కిడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బువాలోయ్ (Bualoi) తీవ్ర తుపాను.. వియత్నాంకి తూర్పువైపున ఉంది. అది గంటకు 155 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. దీని వల్ల ఆసియాలో వాతావరణం అల్లకల్లోలంగా మారింది. దీని ప్రభావం మన దేశంపై ఇంకా లేదు. ఇది చైనావైపు వెళ్లేలా ఉంది.
భూమధ్య రేఖా ప్రాంతం మరింత యాక్టివ్‌గా మారింది. అంటార్కిటికా నుంచి వస్తున్న అతి శీతల గాలులు.. భూమధ్య రేఖా ప్రాంతంలో వేడి వాతావరణానికి తోడై.. అల్లకల్లోల పరిస్థితులు వస్తున్నాయి. దీంతో అక్కడ మేఘాలు బాగా పెరుగుతున్నాయి. అవి మన దక్షిణ భారత్ వైపు వస్తున్నాయి. బంగాళాఖాతం కూడా అల్లకల్లోలంగా ఉంటూ.. మేఘాలను తయారుచేస్తోంది. అందువల్ల అక్టోబర్‌లో కూడా మనం భారీ వర్షాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
AP and Telangana Weather Forecast Update: తీరం దాటిన అల్పపీడనం.. నేడు భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు రెడ్ అలర్ట్!
27
Sep