సీపీఐ (మావోయిస్టు) 21వ స్థాపనా వార్షికోత్సవాలనుx సెప్టెంబర్ 21 నుండి 27 వరకు దేశవ్యాప్తంగా విప్లవ2 స్పూర్తితో నిర్వహించండి.

పార్టీని, పీ.ఎల్.జీ.ఏ.ను, ఐక్య సంఘటనను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం.విప్లవ ప్రతిఘాతక ‘కగార్’ యుద్ధాన్ని విఫలం చేసేందుకు విశాల ప్రజారాశులనువర్గపోరాటంలో, గెరిల్లాయుద్ధంలో సమీకరిద్దాం.శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందాం.విప్లవోద్యమ వెనకంజ స్థితిని అధిగమించే సమర్థతలను పెంచుకుందాం.

పార్టీ శ్రేణులకు, పీ.ఎల్.జీ.ఏ. బలగాలకు, విప్లవ ప్రజా నిర్మాణాలకు, ప్రజానీకానికి సీపీఐ(మావోయిస్టు కేంద్రకమిటీ పిలుపు!

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

సీపీఐ (మావోయిస్టు) 21వ స్థాపనా వార్షికోత్సవాలను సెప్టెంబర్21 నుండి 27 వరకు దేశవ్యాప్తంగా విప్లవ స్పూర్తితోనిర్వహించండి.పార్టీని, పీ.ఎల్.జీ.ఏ.ను, ఐక్య సంఘటనను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం.విప్లవ ప్రతిఘాతక ‘కగార్’ యుద్ధాన్ని విఫలం చేసేందుకు విశాల ప్రజారాశులనువర్గపోరాటంలో, గెరిల్లాయుద్ధంలో సమీకరిద్దాం.శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందాం.విప్లవోద్యమ వెనకంజ స్థితిని అధిగమించే సమర్థతలను పెంచుకుందాం.ప్రియమైన కామ్రేడ్స్, ప్రజలారా!గత సంవత్సరం మనం విప్లవ ప్రతిఘాతక ‘కగార్’ యుద్ధాన్ని ప్రతిఘటిస్తూనే మనపార్టీ 20వవార్షికోత్సవాలను ఉత్సాహంగా జరుపుకున్నాం. ఆ వార్షికోత్సవాల సందర్భంగా యావత్తు పార్టీకి,విప్లవోద్యమానికి మన కేంద్రకమిటీ నిర్దేశించిన కర్తవ్యాల సాధనకు గత సంవత్సర కాలంగాకగార్ యుద్ధాన్ని విఫలం చేసేందుకు మనపార్టీ, పీ.ఎల్.జీ.ఏ., స్థానిక నిర్మాణాలు అత్యంతసాహసోపేతంగా, దృఢసంకల్పంతో కృషి చేస్తున్నాయి. ఈ కృషిలో పాల్గొన్న పార్టీ శ్రేణులకు,పీ.ఎల్.జీ.ఏ. బలగాలకు, ప్రజా నిర్మాణాల కార్యకర్తలకు, అన్ని రంగాల నాయకులకు, విప్లవప్రజానీకానికి, విప్లవ శ్రేయోభిలాషులకు మన కేంద్రకమిటీ విప్లవాభినందనలు తెలియజేస్తోంది.పార్టీని, పీ.ఎల్.జీ.ఏ.ను, ఐక్యసంఘటనను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందామనీ, విప్లవప్రతిఘాతక ‘కగార్’ యుద్ధాన్ని విఫలం చేసేందుకు విశాల ప్రజారాశులను వర్గపోరాటంలో,గెరిల్లాయుద్ధంలో సమీకరిద్దామనీ, శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందామని,విప్లవోద్యమ వెనకంజ స్థితిని అధిగమించేలా పార్టీ శక్తి, సమర్థతల్ని పెంచుకుందామని 21వ పార్టీస్థాపన వార్షికోత్సవాల సందర్భంగా యావత్తు పార్టీ శ్రేణులకు, విప్లవ ప్రజానీకానికి మనకేంద్రకమిటీ పిలుపునిస్తోంది.ఈ సంవత్సరకాలంలో నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ, కగార్యుద్ధాన్ని ప్రతిఘటిస్తూ మనపార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు (నంబాల కేశవరావు),కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్స్ చలపతి, వివేక్, ఉదయ్ లు, రాష్ట్రకమిటీ కామ్రేడ్స్ శర్మ (జగ్జీత్సింగ్ సోహల్), గౌతం, మధు (సజ్జా వెంకట నాగేశ్వరరావు), జయ, రూపేష్, నీతి, కార్తిక్, చైతే,

గుడ్డు, సత్యం, అలోక్, పాపన్న, మధు (ఏగోళపు మల్లయ్య), భాస్కర్, జగన్, అరుణ, విజయ్ లుఅమరులయ్యారు. ఇదే కాలంలో జిల్లాకమిటీ / కంపెనీ పార్టీ కమిటీ కామ్రేడ్స్ 26 మంది, ఏరియాకమిటీ/ప్లాటూన్ పార్టీ కమిటీ కామ్రేడ్స్ 86 మంది, పార్టీ, పీఎల్.జీ.ఏ. సభ్యులు 152 మంది,స్థానిక నిర్మాణాల సభ్యులు, విప్లవ ప్రజలు 38 మంది, వివరాలు తెలియని కామ్రేడ్స్ 43 మందివున్నారు. మొత్తం 366 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. ఫిలిప్పీన్స్ కమ్యూనిస్టు పార్టీకేంద్రకమిటీ సభ్యుడు, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్ నాయకుడు కామ్రేడ్ లూయిజలందానీ జూన్ 7న 90 ఏళ్ల వయసులో అనారోగ్యంతో అమరుడయ్యాడు. ఈసంవత్సరకాలంలో ప్రపంచ విప్లవంలో భాగంగా వివిధ దేశాల్లో కొద్దిమంది విప్లవ నాయకులు,సభ్యులు అమరులయ్యారు. ఈ అమరులందరికీ కేంద్రకమిటీ వినమ్రంగా శ్రద్ధాంజలిఘటిస్తున్నది. అమరుల మహోన్నత ఆశయసాధన కోసం దృఢ సంకల్పంతో కృషి చేస్తామనిశపథం చేస్తున్నది.

ప్రియమైన కామ్రేడ్స్, ప్రజలారా!

1972లో ఆనాటి మన పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చారుమజుందార్ ను పోలీసులుపట్టుకుని హత్యచేసిన 53 ఏళ్ల తర్వాత మనపార్టీ ప్రధాన కార్యదర్శి శత్రు దాడిలో అమరుడుకావడం ఇదే మొదటిసారి. నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల అనంతరం ఒక సంవత్సర కాలంలోనేప్రధాన కార్యదర్శి సహ నలుగురు కేంద్రకమిటీ సభ్యులు, 17 మంది రాష్ట్రకమిటీ సభ్యులుఅమరులు కావడం ఇదే మొదటిసారి. ఈ నష్టాలు భారత విప్లవోద్యమాన్ని సాపేక్షికంగా దీర్ఘకాలంపాటు నకారాత్మకంగా ప్రభావితం చేస్తాయి. ఈ ప్రభావాన్ని అధిగమించడం కోసం కృషిచేయడమే మన కర్తవ్యం. కగార్ యుద్ధంతో విప్లవోద్యమం తీవ్రమైన నష్టాల పాలవుతున్న స్థితిలోవిప్లవోద్యమ భవిష్యత్తు పట్ల విప్లవ శిబిరంలో తలెత్తుతున్న ప్రశ్నలకు జవాబునిస్తూ,భయాందోళనలకు గురయిన వారికి ధైర్యాన్ని కల్పిస్తూ, వారిలో ఆత్మవిశ్వాన్ని నింపుతూ, దృఢసంకల్పంతో, అసమాన ధైర్యసాహసాలతో యావత్తు విప్లవ శిబిరాన్ని ముందుకు నడపడమే పార్టీకర్తవ్యం. ఈ కర్తవ్య సాధన కోసం జరుగుతున్న నష్టాలకు కారణాల్ని గుర్తించి, వాటినిసరిదిద్దుకోవడం అవసరం; భౌతిక పరిస్థితి (అబ్జెక్టివ్ కండిషన్), స్వీయాత్మక పరిస్థితి (సబ్జెక్టివ్కండిషన్)లో విప్లవోద్యమ పురోగమనానికి అనుకూలంగా పెంపొందుతున్న అంశాలను గుర్తించివాటి ఆధారంగా పార్టీని, పీ.ఎల్.జీ.ఏ.సు, ఐక్యసంఘటనను సంఘటితం చేసుకోవడం అవసరం.ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో అనేక దేశాల్లో ముఖ్యంగా రష్యా, చైనాలో విప్లవోద్యమాలుతాత్కాలిక వెనకంజకు, ఓటమికి గురయినప్పటికీ ఆ విప్లవోద్యమాలు ఆ స్థితిని అధిగమించివిజయవంతమయ్యాయి. అక్కడి విప్లవ పార్టీలు ఆనాడు ఆ వెనకంజకు, ఆ ఓటమికి దారితీసినకారణాలను, తమ దేశాల్లోని వస్తుగత, స్వీయాత్మక పరిస్థితులను మార్క్సిస్టు పద్దతిని అనుసరించిసరిగా విశ్లేషించి, సరైన రాజకీయ, సైనిక ఎత్తుగడలను చేపట్టి, వాటిని దృఢ సంకల్పంతోఆచరించిన ఫలితంగానే ఆ విప్లవోద్యమాలు విజయవంతమయ్యాయి. మనపార్టీ చరిత్రలో కూడా అనేది మానసిక యుద్ధంలో భాగం. ఈ మానసిక యుద్ధ ప్రభావానికి విప్లవ శిబిరంగురికాకూడదు. కర్రెగుట్ట ఆపరేషన్ సమయంలో మనం వేలాది బూబీట్రాపుల్ని అమర్చడంతోశత్రు సాయుధ బలగాలు 16 రోజుల పాటు అడ్వాన్స్ కాలేదు, చివరికి మననుండి మూకాల్అనేవాడు పారిపోయి శత్రువుకు సరెండరయి ద్రోహిగా మారి పోలీసులకు గైడ్ గా వ్యవహరించిమన బలగాలపై దాడి చేయించిన ఫలితంగానే మనకు నష్టాలు జరిగాయి. శత్రువు మనకు జరిగిననష్టాల్ని ప్రకటించాడు కానీ తనకు జరిగిన నష్టాల్ని ప్రకటించలేదు. ఈ ఆపరేషన్ సమయంలో110 చోట్ల బూబీట్రాపులు పేలి శత్రు సాయుధ బలగాలు 45-50 మంది చనిపోయి, 70-80మంది గాయపడ్డారు. అలాగే మే 8 నాడు శత్రు సాయుధ బలగాలు మన బలగాల్ని చుట్టుముట్టిదాడి చేసినప్పటికీ ఆ దాడిని మన బలగాలు ధైర్యసాహసాలతో తిప్పికొట్టాయి. ఈ ప్రతిఘటనలోమన బలగాలు 5 గురు గ్రేహౌండ్స్ కమాండోలను నిర్మూలించి, 4 గురు కమాండోలనుగాయపర్చి వారినుండి ఒక ఏకే, ఒక ఎస్ఎస్ఆర్ ను, 150 తూటాలను ఇతరత్ర సామాన్లనుస్వాధీనం చేసుకున్నాయి. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి తమ బలగాల క్రాస్ ఫైరింగ్ లో గ్రేహౌండ్స్పోలీసులు చనిపోయారని ప్రకటించారు. ముల్గొండ వద్ద జూలై 8 నాడు మన పీ.ఎల్.జీ.ఏ.బలగాలు సాహసిక ఆంబుష్ చేసి 11 మందిని నిర్మూలించి, 5 గురిని గాయపరిస్తే, శత్రువుతమవైపు ముగ్గురు సీ.ఆర్.పీ.ఎఫ్. పోలీసులు మాత్రమే గాయపడ్డారని ప్రకటించాడు. ఇలాగేఝార్ఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో మన ప్రతిఘటనలో తనవైపు జరుగుతున్న నష్టాలను శత్రువుప్రకటించడం లేదు. ఇది బలహీనమైన శత్రు మొరేల్ కు నిదర్శనం. అందుకే శత్రువు ఒక పార్టీకార్యకర్త/ప్రజా గెరిల్లా వెనక 30 నుండి 100 సాయుధ బలగాలను మోహరిస్తున్నాడు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమ ప్రాంతాల్లో లక్షలాది సాయుధ బలగాల్ని మోహరించి, వాటికి ఆధునికఆయుధాల్ని, ఆధునిక టెక్నాలజీని అందించినా అవి మన బలగాల సంఖ్యకు సమాన సంఖ్యలోవచ్చి దాడి చేయడానికి సాహసించక పోవడానికి కారణం ఆ బలగాలు కిరాయి బలగాలుకావడమే. ఇది శత్రు సాయుధ బలగాల వ్యూహాత్మక బలహీనత. ఈ బలహీనతే అంతిమంగాశత్రు ఓటమికి దారితీస్తుంది.కగార్ యుద్ధం ఫలితంగా మన స్వీయాత్మక శక్తులు నష్టపోయినప్పటికీ మనకు అనేకరాష్ట్రాల్లో పార్టీ, ప్రజాసంఘాలున్నాయి. వాటి నాయకత్వంలో వేర్వేరు ప్రాంతాల్లో వేలాదిమందిప్రజలు విప్లవోద్యమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికీ మనకు కొన్ని రాష్ట్రాల్లో గెరిల్లాదళాలున్నాయి, అవి శక్తి మేరకు గెరిల్లాయుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి.ప్రపంచంలోని అన్ని దేశాల వర్గపోరాటాల అనుభవ సారమే శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతం.విప్లవోద్యమంలో అనుకూలతలు ప్రధానంగా ఉన్న సమయాల్లో కూడా ప్రతికూలతలుఉంటాయనీ, ప్రతికూలతలు ప్రధానంగా ఉన్న సమయాల్లో కూడా అనుకూలతలు ఉంటాయనివిప్లవ సిద్ధాంతం చెపుతుంది. అలాగే శత్రువును / దోపిడీ వర్గాలను వ్యూహాత్మకంగా, ఎత్తుగడలపరంగా అంచనా వేయాలనీ, దోపిడీ వర్గాలను వ్యూహాత్మకంగా కాగితపు పులిగానే అంచనా
వేయాలని మన సిద్ధాంతం చెపుతుంది. అందుకే ఎత్తుగడలపరంగా నేడు శత్రువు ఆధిక్యతలోవున్న వ్యూహాత్మకంగా బలహీనుడే. మనం వస్తుగత స్థితిని, స్వీయాత్మక స్థితిని గతితార్కికంగావిశ్లేషించాలి. అంటే మనం వాటి గురించి ఏకపక్ష, స్వీయాత్మక అంచనాలు వేయకూడదు.అందుకే మనం వస్తుగత స్థితి విప్లవానికి అనుకూలంగా మారుతుందని, స్వీయాత్మక స్థితిబలహీనంగా ఉందని, విప్లవోద్యమం తాత్కాలిక వెనకంజలో వుందని, ప్రస్తుతం శత్రువుఆధిక్యతలో ఉన్నాడని అంచనా వేస్తున్నాం. అయితే ఈ స్థితిని తప్పనిసరిగా మార్చగలుగుతాం,మార్చడం కోసం కృషి చేయడం మన కర్తవ్యం. విప్లవోద్యమం తాత్కాలిక వెనకంజలో ఉన్నా,ఓటమి పాలయినా వర్గాలు ఉన్నంతకాలం వర్గపోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఆవర్గపోరాటాన్ని సరైన ఎత్తుగడలతో నడిపితే విప్లవ పార్టీ తిరిగి బలపడి, విప్లవోద్యమంపురోగమిస్తుంది.అందుకే నేటిస్థితిలో, కేవలం శత్రు ఆధిక్యతను, మనకు జరుగుతున్న నష్టాలను మాత్రమేచూసి అవిశ్వాసానికి గురికావద్దు, అధైర్యపడొద్దు, నిష్క్రియపరత్వానికి గురికావద్దు. శత్రుఆధిక్యతతో పాటు వాడికున్న బలహీనతలనూ, ఉద్యమ ప్రాంతాలంతటా, దేశవ్యాప్తంగా మనపార్టీ తమకు అండగా ఉండాలని కోరుకుంటున్న కోట్లాది ప్రజల ఆకాంక్షల్ని, విప్లవోద్యమంలోవేర్వేరు రూపాల్లో కదులుతున్న వారి భాగస్వామ్యాన్ని, వారి మద్దతును గమనంలో ఉంచుకునిమనం నిండైన విశ్వాసంతో, ధైర్యంగా, క్రియాశీలంగా, చొరవగా పనిచేయాలి. మారిన పరిస్థితికితగినట్టుగా వర్గపోరాటాన్ని, గెరిల్లాయుద్ధాన్ని నడపాలి.విప్లవోద్యమంలోని అనుకూలతలను వెన్నంటి రహస్య పనివిధానాన్ని అమలు చేయడంలోకొన్ని లోపాలు జరిగాయి. ఆ లోపాలను సరిదిద్దుకోవడం ద్వారా మనపార్టీని శత్రువుకుఅభేద్యంగా తయారు చేసుకోవాలి. అలాగే సరెండర్లను నివారించాలి. మారిన సామాజిక పరిస్థితికితగినట్టుగా, తాత్కాలిక వెనకంజను అధిగమించేలా వర్గపోరాటాన్ని, గెరిల్లాయుద్ధాన్ని నడపడంద్వారానే పార్టీ శక్తి, సమర్థతలు పెరుగుతాయి. అందుకోసం ‘భారతదేశంలో ఉత్పత్తి సంబంధాల్లోమార్పులు-మన రాజకీయ కార్యక్రమం’, ‘కులసమస్య-మన దృక్పథం’, ‘జాతుల సమస్య-మనదృక్పథం’ డాక్యుమెంట్ల గైడెన్స్ లో సామ్రాజ్యవాదానికీ, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ వర్గానికీ,భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా వర్గపోరాటాన్ని కొనసాగిద్దాం. చిన్న, వికేంద్రీకృత చర్యల ద్వారాగెరిల్లా యుద్ధాన్ని కొనసాగిద్దాం.కగార్ యుద్ధాన్ని ఆపివేయాలని, మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలుజరపాలని దేశంలో ప్రజలు కొనసాగిస్తున్న ఉద్యమానికి మద్దతునిద్దాం. ప్రజల ప్రయోజనాలరీత్యా మా పార్టీ ఎప్పుడైనా శాంతిచర్చలకు సిద్ధమేనని మరోసారి తెలియజేస్తున్నాం. అయితేఅందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధాన్ని ఆపివేయాలని, ఉద్యమ ప్రాంతాల్లోసాయుధ బలగాల క్యాంపుల ఏర్పాటును ఆపివేయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం.

వేయాలని మన సిద్ధాంతం చెపుతుంది. అందుకే ఎత్తుగడలపరంగా నేడు శత్రువు ఆధిక్యతలోవున్న వ్యూహాత్మకంగా బలహీనుడే. మనం వస్తుగత స్థితిని, స్వీయాత్మక స్థితిని గతితార్కికంగావిశ్లేషించాలి. అంటే మనం వాటి గురించి ఏకపక్ష, స్వీయాత్మక అంచనాలు వేయకూడదు.అందుకే మనం వస్తుగత స్థితి విప్లవానికి అనుకూలంగా మారుతుందని, స్వీయాత్మక స్థితిబలహీనంగా ఉందని, విప్లవోద్యమం తాత్కాలిక వెనకంజలో వుందని, ప్రస్తుతం శత్రువుఆధిక్యతలో ఉన్నాడని అంచనా వేస్తున్నాం. అయితే ఈ స్థితిని తప్పనిసరిగా మార్చగలుగుతాం,మార్చడం కోసం కృషి చేయడం మన కర్తవ్యం. విప్లవోద్యమం తాత్కాలిక వెనకంజలో ఉన్నా,ఓటమి పాలయినా వర్గాలు ఉన్నంతకాలం వర్గపోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఆవర్గపోరాటాన్ని సరైన ఎత్తుగడలతో నడిపితే విప్లవ పార్టీ తిరిగి బలపడి, విప్లవోద్యమంపురోగమిస్తుంది.అందుకే నేటిస్థితిలో, కేవలం శత్రు ఆధిక్యతను, మనకు జరుగుతున్న నష్టాలను మాత్రమేచూసి అవిశ్వాసానికి గురికావద్దు, అధైర్యపడొద్దు, నిష్క్రియపరత్వానికి గురికావద్దు. శత్రుఆధిక్యతతో పాటు వాడికున్న బలహీనతలనూ, ఉద్యమ ప్రాంతాలంతటా, దేశవ్యాప్తంగా మనపార్టీ తమకు అండగా ఉండాలని కోరుకుంటున్న కోట్లాది ప్రజల ఆకాంక్షల్ని, విప్లవోద్యమంలోవేర్వేరు రూపాల్లో కదులుతున్న వారి భాగస్వామ్యాన్ని, వారి మద్దతును గమనంలో ఉంచుకునిమనం నిండైన విశ్వాసంతో, ధైర్యంగా, క్రియాశీలంగా, చొరవగా పనిచేయాలి. మారిన పరిస్థితికితగినట్టుగా వర్గపోరాటాన్ని, గెరిల్లాయుద్ధాన్ని నడపాలి.విప్లవోద్యమంలోని అనుకూలతలను వెన్నంటి రహస్య పనివిధానాన్ని అమలు చేయడంలోకొన్ని లోపాలు జరిగాయి. ఆ లోపాలను సరిదిద్దుకోవడం ద్వారా మనపార్టీని శత్రువుకుఅభేద్యంగా తయారు చేసుకోవాలి. అలాగే సరెండర్లను నివారించాలి. మారిన సామాజిక పరిస్థితికితగినట్టుగా, తాత్కాలిక వెనకంజను అధిగమించేలా వర్గపోరాటాన్ని, గెరిల్లాయుద్ధాన్ని నడపడంద్వారానే పార్టీ శక్తి, సమర్థతలు పెరుగుతాయి. అందుకోసం ‘భారతదేశంలో ఉత్పత్తి సంబంధాల్లోమార్పులు-మన రాజకీయ కార్యక్రమం’, ‘కులసమస్య-మన దృక్పథం’, ‘జాతుల సమస్య-మనదృక్పథం’ డాక్యుమెంట్ల గైడెన్స్ లో సామ్రాజ్యవాదానికీ, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ వర్గానికీ,భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా వర్గపోరాటాన్ని కొనసాగిద్దాం. చిన్న, వికేంద్రీకృత చర్యల ద్వారాగెరిల్లా యుద్ధాన్ని కొనసాగిద్దాం.కగార్ యుద్ధాన్ని ఆపివేయాలని, మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలుజరపాలని దేశంలో ప్రజలు కొనసాగిస్తున్న ఉద్యమానికి మద్దతునిద్దాం. ప్రజల ప్రయోజనాలరీత్యా మా పార్టీ ఎప్పుడైనా శాంతిచర్చలకు సిద్ధమేనని మరోసారి తెలియజేస్తున్నాం. అయితేఅందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధాన్ని ఆపివేయాలని, ఉద్యమ ప్రాంతాల్లోసాయుధ బలగాల క్యాంపుల ఏర్పాటును ఆపివేయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం.

8

ప్రియమైన కామ్రేడ్స్, ప్రజలారా!

అంతర్జాతీయంగా ఈ మధ్యకాలంలో జరిగిన / జరుగుతున్న పరిణామాలన్నీ 2008 నుండికొనసాగుతున్న సామ్రాజ్యవాద ఆర్థిక సంక్షోభపు పర్యవసానాలే. దాదాపు గత 12-13 ఏళ్లుగాకొనసాగుతున్న బహుధృవ ప్రపంచపు అస్థిరత, అల్లకల్లోలం, గందరగోళపు వ్యక్తీకరణలే.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధిస్తున్న సుంకాలతో (టారిఫ్ లతో),ప్రతీకార సుంకాలతో నష్టాల పాలవుతున్న వెనకబడిన దేశాలు చైనా, రష్యాలతో వ్యాపారఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీంతో అమెరికా ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రతరమయి అక్కడిప్రజలు ట్రంప్ ఆర్థిక విధానాల్ని వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వస్తున్నారు. చైనా, ఒకవైపు అమెరికాతోతాత్కాలికంగా సుంకాల తగ్గింపు ఒప్పందం చేసుకుని, మరోవైపు వెనకబడిన దేశాలతో (గ్లోబల్సౌత్) వ్యాపార ఒప్పందాలు చేసుకుని తన ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నాలుచేస్తోంది. వెనకబడిన దేశాలతో రష్యా వ్యాపార ఒప్పందాలు చేసుకుంటూ యుక్రెయిన్ యుద్ధాన్ని

కొనసాగించగలుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సెమీకండక్టర్స్, విద్యుత్ వాహనాలు (ఎలక్ట్రిక్ వెహికిల్స్), కీలకఖనిజాలు (రేర్ ఎర్త్ మినరల్స్), అంతరిక్ష రంగాల్లో సామ్రాజ్యవాద దేశాల మధ్య తీవ్రమైన పోటీకొనసాగుతోంది. ఈ పోటీలో భాగంగానే అమెరికా నాయకత్వంలోని నాటో కూటమికి రష్యామధ్య ఉక్రెయిన్ లో పరోక్ష యుద్ధం కొనసాగుతోంది, ఇందులో భాగంగానే పశ్చిమాసియాలోఅమెరికా ఇజ్రాయిల్ ను ముందుంచి పాలస్తీనా జాతిని నిర్మూలించి గాజా సహ మొత్తం పాలస్తీనాభూభాగాన్ని ఆక్రమించే దురాక్రమణ యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కడానికిసామ్రాజ్యవాదం అనుసరిస్తున్న ఆర్థిక, రాజకీయ, సైనిక, సాంకేతిక విధానాల ఫలితంగా, అవివెనకబడిన దేశాలపై దురాక్రమణ యుద్ధాలకు పాల్పడుతున్నందున, ఫాసిజాన్ని అమలుచేస్తున్నందునా వాటితో వెనకబడిన దేశాల్లోని పీడిత జాతులకు, ప్రజలకు; సామ్రాజ్యవాదానికీమధ్య వైరుధ్యం మరింత తీవ్రతరమవుతున్నాయి, పెట్టుబడిదారీ దేశాల్లో పెట్టుబడిదారీ వర్గానికీకార్మిక వర్గానికీ నడుమ వైరుధ్యం మరింత తీవ్రతరం అవుతోంది. దాని ఫలితంగాప్రపంచవ్యాప్తంగా విప్లవానుకూల పరిస్థితి మరింత పెరుగుతోంది.బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు అర్ఎస్ఎస్-బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2047 నాటికిదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) అభివృద్ధి చేస్తామనే ప్రచార హోరునుప్రజలు అర్థం చేసుకోవడం అవసరం. ‘వికసిత్ భారత్’ అంటే కార్పొరేట్ హిందూదేశమే తప్పమరేమి కాదు. అంటే దేశం ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలన్నింటా దేశ,విదేశీ కార్పొరేట్ల (సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ వర్గం) దోపిడీ పీడనలుమరింత పెరిగి చట్టబద్దతను సంతరించుకుంటున్నాయి. ఆ కార్పొరేట్లతో భూస్వామ్య వర్గాలకుమ్మక్కు పెరిగి ఈ మూడింటి కూటమి పీడిత ప్రజలను, పీడిత సాంఘిక సముదాయాలను,పీడిత జాతులను తీవ్రమైన దోపిడీ, పీడనలకు గురిచేస్తాయి. అందుకే ‘వికసిత్ భారత్’ అంటేసామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ వర్గ, భూస్వామ్య వర్గాల సంపదలు పెరగడమే,అశేష ప్రజానీకపు (పీడిత ప్రజల, పీడిత సాంఘిక సముదాయాల, పీడిత జాతుల) సంపదలు,ఉపాధి అవకాశాలు, అధికారాలు తగ్గిపోవడమే. అందుకే ‘వికసిత్ భారత్’ అంటే దేశంలో అశేషప్రజానీకపు బతుకులు వినాశనం కావడమే. అందుకే ‘వికసిత్ భారత్’ లోని మోసాన్ని అర్థంచేసుకుని దానికి వ్యతిరేకంగా పోరాడడమే ఈరోజు దేశ ప్రజల కర్తవ్యం.ఈ మధ్యకాలంలో భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతయ్యే సరుకులపై సుంకాలుపెరగడంతో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఆత్మ నిర్భరతా (స్వావలంబన), స్థానిక ఉత్పత్తుల్నికొనుగోలు చేయాలనే (వోకల్ ఫర్ లోకల్) ప్రచారాన్ని తీవ్రతరం చేసారు. సామ్రాజ్యవాదదేశాలతో కుదుర్చుకున్న అసమాన ఆర్థిక, వ్యాపార, వాణిజ్య ఒప్పందాల్ని రద్దుచేసుకోనంతకాలం, సామ్రాజ్యవాదానికి తలొగ్గని స్వతంత్ర ఆర్థిక విధానాలనుఆచరించనంతకాలం ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాలు మనదేశ ప్రజల్నిమోసగించే బూటకపు విధానాలే/నినాదాలే తప్ప వాటితో దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటిమార్పురాదు. అమెరికా ప్రతీకార సుంకాలకు ప్రతిగా ప్రతీకార సుంకాలు విధించలేని భారతప్రభుత్వం ఒకవైపు అమెరికా నుండి దిగుమతయ్యే చక్కెరపై సుంకాలు తగ్గింపు కాలాన్ని డిసెంబర్వరకు పొడిగిస్తానని ప్రకటించింది. ఈ ఒక్క పాలసీ ద్వారా, ‘భారతదేశ మార్కెట్లోకిచొరబడనున్న బహుళజాతి సంస్థలను అడ్డుకుని దేశ రైతాంగాన్ని, పాల ఉత్పత్తిదార్లను,మత్స్యకారులను కాపాడుతాననని’ మోదీ చేసిన/చేస్తున్న ప్రకటనలు బూటకం అనితేలిపోయాయి. ఒకవైపు రష్యా, చైనాలతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటూనే అమెరికాకుకంటగింపు కాకూడదని ‘భారత-అమెరికా దేశాల మధ్యనున్న సంబంధాలు ప్రత్యేకమైనవనీ,వ్యూహాత్మకమైనవనీ, ఇరుదేశాల ప్రయోజనాలకు భంగం కలగని విధంగా వ్యవహరిస్తామని ఈమధ్య భారతదేశ విదేశాంగ మంత్రిత్వశాఖ చేసిన ప్రకటన భారతదేశపు లొంగుబాటునుప్రదర్శించేదే తప్ప స్వతంత్రతను, స్వావలంబనను ప్రదర్శించేది కాదు. అందుకే మోదీ, బీజేపీలమోసాల్ని తిప్పికొట్టి సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ వర్గాలకు, భూస్వామ్యవర్గాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాన్ని తీవ్రతరం చేయడం ఈనాడు దేశప్రజల కర్తవ్యం.మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుండి బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటరీఎన్నికల్లో ఓట్ల దొంగతనం (ఓట్ చోరి)తో సహ అనేక ఎన్నికల అక్రమాలకు పాల్పడుతూఎన్నికలను గెలుస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే 2024 ఏప్రిల్ అసెంబ్లీ, పార్లమెంటరీఎన్నికల్లో, తదనంతరం జరిగిన మహారాష్ట్ర తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంహస్తగతం చేసుకోగలిగింది. ‘ఓట్ చోరీ’ అక్రమాల్ని కాంగ్రెస్ పార్టీ చాలా ఆలస్యంగా వెలుగులోకితేగలిగింది. దీంతో మరోసారి పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థ ఎంతటి బూటకమో ప్రజలకుతెలిసివచ్చింది. అందుకే నిజమైన ప్రజాస్వామ్యం నూతన ప్రజాస్వామిక విప్లవ విజయం ద్వారానే సాధ్యం. అందుకే మావోయిస్టు పార్టీ నాయకత్వంలో సాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవంలోభాగస్వాములు కావాల్సిందిగాకావాల్సిందిగా దేశంలోని అశేష ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం.సామ్రాజ్యవాదాన్ని, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ వర్గాన్ని, భూస్వామ్య వర్గాన్ని అధికారం నుండికూలదోయడం ద్వారా దేశంలో దోపిడి, పీడనలు లేని నూతన ప్రజాస్వామిక వ్యవస్థను,సోషలిజాన్ని నెలకొల్పడం కోసం సాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వాములుకావాల్సిందిగా అశేష ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం.

నినాదాలు

* మన పార్టీని, విప్లవోద్యమాన్ని నిర్మూలించే దుష్టలక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుకొనసాగిస్తున్న ‘ఆపరేషన్ కగార్’ విప్లవ ప్రతిఘాతక యుద్ధాన్ని తిప్పికొడుదాం.ప్రజాపునాదిని, స్వీయాత్మక శక్తులను పెంచుకుంటూ పార్టీని, పీ.ఎల్.జీ.ఏ.ను, ప్రజానిర్మాణాలను ఐక్య సంఘటనను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం.

నష్టాలను నివారించుకుందాం.

* లొంగుబాట్లను, విప్లవ ద్రోహాన్ని వ్యతిరేకిద్దాం. పీడిత ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకుదృఢంగా పోరాడుదాం.* శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందాం.* నిరంతరం పెంపొందే ప్రజాపునాదిపై ఆధారపడి శక్తిమేరకు గెరిల్లాయుద్ధాన్ని కొనసాగిద్దాం.* సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యతిరేక వర్గపోరాటాన్నితీవ్రతరం చేద్దాం.* బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదాం.* మార్క్సిజం-లెనినిజం-మావోయిజం వర్ధిల్లాలి.* భారత నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి.* ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పీ.ఎల్.జీ.ఏ.) వర్ధిల్లాలి.* భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) వర్ధిల్లాలి.

విప్లవాభినందనలతో,

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

6.9.2025.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe