కాగజ్ నగర్ రూరల్ మండలంలసని అంకూషాపూర్ గ్రామంలో రైతులు భూమి దున్నుకోకుండా అడ్డుకోవడంతో గ్రామ రైతులందరూ సహాయం చేయాలని కోరడంతో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు కాగజ్ నగర్ లోని ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సుశాంత్ గారిని తన కార్యాలయంలో కలిశారు.
అంకుశాపూర్ గ్రామస్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారని,వారు కేవలం తిండి కోసమే పంట వేసుకుంటారని,అది కూడా కేవలం ఏడాదికి వర్షాకాలంలో ఒక్కటే పంట వేసుకొని బతుకుతారని పంట వేసుకోకపోతే వారు బతకడం కష్టమని డిఎఫ్ఓ కి వివరించారు.
అటవీ చట్టాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.డిఎఫ్ఓ సానుకూలంగా స్పందించి,గ్రామస్థులతో చర్చించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్ ఇఎస్ఐ హాస్పిటల్ ను సందర్శించారు.అక్కడి వసతులు ఎలా ఉన్నాయో పరిశీలించారు.డాక్టర్ తో మాట్లాడి అక్కడి వెద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
సిర్పూర్ మండల కన్వీనర్ అస్లాం అనారోగ్యంతో సిర్పూర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారని తెలుసుకొని పరామర్శించారు. ప్రభుత్వ దవాఖానలో కరెంట్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. జనరేటర్ ఉన్నా పనిచేయడం లేదని,హాస్పిటల్ లో పెషెంట్లు కరెంట్ లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
గత బిఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంట్ ఇస్తే,కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు తప్పడం లేదన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని,కరెంట్ కోతల ప్రభుత్వమని విమర్శించారు.
నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాం రావు,నక్క మనోహర్,కాశిపాక రాజు,మహిళా నాయకురాలు వరలక్ష్మి,కమల తదితరులు ప్రవీణ్ కుమార్ వెంట ఉన్నారు.
అంకుషాపూర్ రైతుల సమస్యలపై
డిఎఫ్ఓ అధికారిని కలిసిన ప్రవీణ్ కుమార్.కాంగ్రెస్ కరెంట్ కోతల ప్రభుత్వం డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు.
23
Jun