BB6 TELUGU NEWS CHANNEL :
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధాన మంత్రి శ్రీ టోనీ బ్లెయిర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ‘తెలంగాణ రైజింగ్ 2047’ (Telangana Rising 2047) విజన్లోని కీలక అంశాలను పంచుకున్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ను ప్రజా ప్రభుత్వం రెండవ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 9, 2025న అధికారికంగా ఆవిష్కరించనున్నారు.
టోనీ బ్లెయిర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత, ప్రపంచ నాయకుల విజన్, వ్యూహరచన, వాటి అమలుకు సహాయపడాలనే లక్ష్యంతో టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBIGC)ను స్థాపించారు. ప్రజా ప్రభుత్వం రూపొందించిన Telangana Rising విజన్ అమలులో సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBIGC) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
Related News
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్ నగర్ జిల్లాలో విజయ తెలంగాణ డైరీ (TGDDCFL) ఫ్రాంచైజీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గత నాలుగు నెలలుగా ఉత్పత్తుల సరఫరా పూ...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL హైదరాబాద్, అక్టోబర్ 29:ఎల్-నినో ప్రభావంతో రాబోయే కరువు ముప్పు, బహిరంగ మార్కెట్లో నిత్యవసర ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్...
Continue reading
బంగాళాఖాతంలో ముదురుతున్న ముప్పు - 'అర్నబ్' తుపాన్ దిశగా అల్పపీడనం, ఏపీ-ఒడిశాకు హెచ్చరికలు
BB6 TELUGU NEWS CHANNE...
Continue reading
251 టీఎంసీల నీటి కొరత.. యాసంగి సాగు వాయిదా వేసుకోండి!ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో వచ్చే 10 నెలలు కష్టకాలమే - సీఎం రేవంత్
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL ప్రజలను పట్టి పీడించుకుంటున్న వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడి చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. అధిక వడ్డీ వసూళ్లు చేస్తున్న వారి...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL హైదరాబాద్: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నశా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా మాదకద్రవ్య రహిత సమాజం కోసం తెలంగాణ ఈగల్ ఫోర్స్ మరో అడుగు ము...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ సంస్కృతీ వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగలో భాగంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా జ...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్ (CORE) పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించార...
Continue reading
గండీడ్, మహబూబ్ నగర్ జిల్లాBB6 TELUGU NEWS CHANNEL దసరా సెలవులు వచ్చేశాయి.. దీంతో మండల కేంద్రమైన గండీడ్ లోని విద్యాసంస్థలు మూతపడ్డాయి. చదువుల కోసం గండీడ్ కు వచ...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది....
Continue reading
మహిళను హత్య చేసి మృతదేహాన్ని కాల్చిన ప్రియుడు
వెన్నచెడ్ చెరువు కట్ట వద్ద హత్య - ఆర్థిక వివాదమే కారణమా?
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో జున్నా సోలార్ సిస్టమ్స్...
Continue reading
ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఎంపీలు డాక్టర్ మల్లు రవి , రఘువీర్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి , ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ , కార్యదర్శి (సమన్వయం) గౌరవ్ ఉప్పల్ ఉన్నారు.
తెలంగాణలో రైతులు, యువత, మహిళలు వంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ కోర్ అర్బన్, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల వారీగా అభివృద్ధి కోసం సూక్ష్మ ప్రణాళికను సరికొత్తగా రూపొందిస్తున్నట్టు తెలిపారు.
సుస్థిరత సూత్రాలతో తెలంగాణ అభివృద్ధి ఎజెండా దృఢంగా ఉందని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Young India Skills University), యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (Young India Sports University) వంటి ప్రధాన కార్యక్రమాలపై టోనీ బ్లెయిర్ ప్రత్యేక ఆసక్తిని వ్యక్తం చేశారు.
Views: 277