యూకే పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఇంగ్లండ్‌లోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20,21 తేదీల్లో జరిగే సదస్సులో పాల్గొననున్న కేటీఆర్

ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ఆక్స్‌ఫర్డ్‌ ఇండియా ఫోరమ్‌లో ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ (ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్‌మెంట్ ఇన్ ఇండియా) అనే ప్రధాన అంశంపై చర్చ జరగనుంది.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజా సేవలను మెరుగుపరచడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు.