గండీడ్ మండల మరియు గ్రామ ప్రజలకు శుభవార్త ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి సర్పంచ్ రేగరి భగవంత్ రెడ్డి

BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ మండల ప్రజలకు శుభవార్త
గండీడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ రేగరి భగవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శంకర ఐ హాస్పిటల్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అనుభవజ్ఞులైన కంటి వైద్య నిపుణులచే కంటి పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన వారికి కంటి శుక్లాల ఆపరేషన్ కూడా ఉచితంగా చేయబడును అని సర్పంచ్ ఒక ప్రకటనలో తెలిపారు .చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నిరుపేద మరియు మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు.కంటి పరీక్షలకు వచ్చేవారు ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ ఫోన్ నెంబర్ తో రాగలరని ఆపరేషన్కు తీసుకెళ్లే వారికి ఉచితంగా ప్రయాణం సౌకర్యంతో పాటు భోజనం వసతి కల్పిస్తామని శంకర ఐ హాస్పిటల్ వారు తెలియజేశారు.