ఎంజెపిటిబిసి గురుకులలో జయశంకర్ జయంతి వేడుకలు

BB6 TELUGU NEWS CHANNEL
కీసర మహాత్మా జ్యోతిబా ఫూలే వెనకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ గొప్పతం, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన కృషి గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏం. రాములు విద్యార్థులకు వివరించారు. భవిషత్ తరాలకు జయశంకర్ ఆశయాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చార్మినార్, నాంపల్లి, మలక్పేట్ ఎంజేపి పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.