BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు K M నారాయణ పై కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. స్థానిక నాయకులు కార్యకర్తలు అత్యవసర సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న వారిని విస్మరించి, నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకుంటే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సొసైటీ డైరెక్టర్ గా పెద్ద గ్రామం అయిన నంచర్ల అభ్యర్థిని ఎన్నుకున్న తర్వాత వేరే అభ్యర్థికి ఇవ్వడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
మాట ఇచ్చిన విధంగా దళిత అభ్యర్థిని డైరెక్టర్గా చేయడం మండల అధ్యక్షుడికి ఇష్టం లేక మహ్మదాబాద్ మండల వ్యక్తికి డైరెక్టర్ పదవి అంటగట్టడం కరెక్ట్ కాదని గ్రామ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అహర్నిశలు పార్టీ కోసం పార్టీ మండల అధ్యక్షుడు కోసం కష్టపడితే కార్యకర్తలను పట్టించుకోకుండా స్వలాభం కోసం గ్రామాన్ని గ్రామ సభ్యులను పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడను నిరసిస్తూ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు నూతనంగా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీబీ సిక్స్ న్యూస్ ఛానల్ ద్వారా తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
