ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా –  JKMR ఫౌండేషన్ తరపున ప్రోత్సాహక బహుమతి (చెక్కు) అందచేత

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా,గండీడ్ మండలంలోని అన్ని పాఠశాలలో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల ప్రతిభను గుర్తించి, మన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి తన JKMR ఫౌండేషన్ తరపున ప్రోత్సాహక బహుమతిని (చెక్కును) అందజేశారు.

■ఎంపీ ఇతర కార్యక్రమాల వల్ల నేరుగా హాజరు కాలేకపోయినప్పటికీ, విద్యార్థుల పట్ల తనకున్న మమకారంతో.. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఈ ప్రోత్సాహకాన్ని పంపించడం విశేషం. దీనిని మండల అధ్యక్షులు శ్రీ కె. విజయకుమార్ రెడ్డి మరియు స్థానిక నాయకుల చేతుల మీదుగా విద్యార్థినికి అందజేశారు.

■ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ..* పేద విద్యార్థుల ఉన్నత చదువులకు కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటారని కొనియాడారు. విద్యార్థులు వెన్నెలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో… మండల ప్రధాన కార్యదర్శిలు రాజు ,మల్కయ్య , మండల ఉపాధ్యక్షులు వెంకటేష్ , కార్యదర్శి నరేష్ ,సల్కర్ పేట్ గ్రామ సర్పంచ్ హేమలత పవన్ కుమార్,మండల ఓబిసి మోర్చా అధ్యక్షులు రఘు ,మండల సీనియర్ నాయకులు చాకలి బాలయ్య ,బిజెపి మండల యువ నాయకులు నరహరి రెడ్డి ,శ్రీనివాస్ , శక్తి కేంద్రం ఇంచార్జ్ నరేందర్ ,బూత్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ , బాలయ్య , కృష్ణ  గ్రామ యువ నాయకులు నాగలింగం ,మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నవీన్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe