BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని చిన్నవార్వాల్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గ్రామంలో ర్యాలీ చేసి అతని చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించిన గ్రామస్తులు మరియు స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు
శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని శివనేరి కోటలో షాజీ బొంశ్లే జిజియా బాయి దంపతులకు జన్మించాడు. శివాజీ తన జీవిత కాలంలో మొఘల్ సామ్రాజ్యం గోల్కొండ సుల్తానేట్ బీజాపూర్ సుల్తానెట్ లపై పోరాటం చేసి విజయం సాధించాడు అతని సైనిక దళాలు మరాఠా గోళాలను విస్తరించి కోటలన్నిటినీ స్వాధీనం చేసుకున్నాడు నావికాదళం ఏర్పాటు చేశాడు చక్కటి నిర్మాణాత్మక పాలనా సంస్థలతో సమస్త ప్రగతిశీల పాలనను కొనసాగించాడు. 1674 సంవత్సరంలో రాయఘడ్ కోటలో చత్రపతిగా పట్టాభిషేకం చేసుకొని ధైర్య సహాసాలు మతసామరస్యంతో పరిపాలించారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయడం తాను చేస్తున్న పని పట్ల అంకిత భావం మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దాసరి రాములు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణ దేవి, ఉపాధ్యాయులు ఎం.వెంకట్ రాములు,పగిడ్యాల్ బోరు కృష్ణయ్య,
బి.మల్లేష్,మరియు భాస్కర్ రెడ్డి కొండమోని పవన్ కుమార్,చిట్యాల కృష్ణ, దాసరి వెంకటేష్ ,సి.ఎచ్.కృష్ణ, ఎన్.హన్మంతు, కె.రవి, శ్రీహరి, కె.నితీష్, భాను, హన్మంత్, సాయిరాం, చెన్నయ్య, శివ, మహేష్ రమేష్, పవన్, కేశవులు మరియు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చిన్నవార్వాల్ గ్రామంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ *జయంతి*
19
Feb