ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం..మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ రాష్ట్రరాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది.ఈ రోజు 2026, జనవరి 20వ తేదీ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా సిట్ హరీష్ రావుకు నోటీసులు పంపినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.మరీ సిట్ విచారణకు హరీష్ రావు హాజరవుతారోలేదో చూడాలి.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe