BB6 TELUGU NEWS CHANNEL : తాండూరు పట్టణం ఏంపిటి ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె అనుచరులతో పాటు రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ, అదేవిధంగా 13 మరియు 15 వ వార్డు కు చెందిన కాంగ్రెస్ నాయకులకు పైలెట్ రోహిత్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ..
తాండూరు మున్సిపల్ ను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది. ఎమ్మెల్యే తలకిందులుగా తపస్సు చేసిన కాంగ్రెస్ పార్టీ గెలవదు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే మున్సిపాలిటీలలో తాండూరు మొదటి స్థానంలో ఉంటుంది. నీకు అభ్యర్థులు దొరకక నా లెఫ్ట్, రైట్ ను అడుక్కుంటున్నావు.మీ దొంగ హామీలు, దొంగ గ్యారంటీలతో మోసపోయి నట్లు ప్రజలు గ్రహించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా మనోహర్ రెడ్డినీ నమ్మకండి, వాడుకుని వదిలేస్తాడు.కాంగ్రెస్ పార్టీని సమాధి కట్టడానికి తాండూరు ప్రజలు ఫిక్స్ అయ్యారు.తాండూరుకు మంజూరు అయిన రూ.18 కోట్ల(యుఐ డిఎఫ్) నిధుల్లో రూ.15 కోట్లు జాతీయ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రుణం కాగా తాండూరు మునిసిపాలిటీ ఈ లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి, ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.3 కోట్లు మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్. సీనియర్ నాయకులు సాయిపూర్ నర్సింలు. శ్రీనివాస్ చారి. మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రికే విజయలక్ష్మి. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్. వార్డ్ ఇంచార్జీ సందీప్ రెడ్డి. మాజీ కౌన్సిలర్ లు మంఖాల రాఘవేందర్. వరాల శ్రీనివాస్ రెడ్డి. సంగీత ఠాకూర్. అనురాధ. పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి సలీం. నాయకుల బషారత్. యూనుస్ తదితరులు ఉన్నారు.
పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
19
Jan