యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట, ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లలో కేసులు

BB6 TELUGU NEWS CHANNEL
యూట్యూబర్ అన్వేష్‌ (నా అన్వేషణ) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణలో వరుస ఫిర్యాదులు నమోదవుతున్నాయి. శివాజీ వ్యాఖ్యలపై స్పందించే క్రమంలో దేవతలను, మహిళలను కించపరిచేలా మాట్లాడాడని ఆరోపిస్తూ కరాటే కల్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే తరహా ఫిర్యాదుతో దానవాయిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు.
అన్వేష్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని భారత్‌కు రప్పించాలని, దేశద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో అన్వేష్‌కు నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe