సీఐటీయు 18 వ అఖిల భారత  మహాసభలను జయప్రదం చేయండి

BB6 TELUGU NEWS CHANNEL
సిఐటియు 18 వ అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో  డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు జరుగుతున్నాయి  జిల్లాలో ఉన్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని,, సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపుమేరకు సిఐటియు  జెండా ఎగరడం జరిగింది.

తాండూర్ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్( సిఐటియు)  18 వ అఖిల భారత  మహాసభలు విశాఖపట్నంలో డిసెంబరు 31 నుండి జనవరి 4 వరకు జరుగుతున్నాయి, జయప్రదం చేయాలని సిఐటియు జెండా తాండూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎగరవేయడం జరిగింది.
సిఐటియు వికారాబాద్ జిల్లా   ప్రధాన కార్యదర్శి కే. శ్రీనివాస్  మాట్లాడుతూ.. ఈనెల డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు తేదీలలో విశాఖపట్నం లో సీఐటీయు 18 వ అఖిల భారత  మహాసభలు జరగనున్నాయని తెలిపారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్ళపై మహాసభలలో సమగ్ర చర్చలు జరుగు తాయని తెలిపారు. మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అఖిల భారత  మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు, వాటి అమలు కోసం చేసిన పోరాటాలు, చర్చించుకుని భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేయనట్లు తెలిపారు. పని హక్కు పనికి తగ్గ కనీస వేతనం, ఉపాధికి భద్రత పని ప్రదేశాలలో కనీస సౌకర్యాల కల్పన, సమస్యల పరిష్కారం కోసం ప్రజా స్వామిక పోరాటాలు కార్మికుని హక్కులని కార్మికుని హక్కులపై కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ ల పేరుతో అణచివేస్తున్నదని విమర్శించారు. కార్మిక చట్టాల సవరణ ద్వారా కార్మిక వర్గంపై కేంద్ర ప్రభుత్వం నిర్భంద నిరంకుశ విధానాలను అనుసరిస్తున్నదని విమర్శించారు. దేశంలో పెట్టుబడిదారి ప్రభుత్వాలు అనుసరిస్తున్న  కార్మిక వ్యతిరేక విధానాలను మహాసభలలో సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటాలు చేస్తున్నదని, కార్మిక వర్గ ఉద్యమాలను సహించలేని ప్రభుత్వాలు సీఐటీయు సంఘం పై, నాయకత్వం పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధాలు విధిస్తున్నాయని తెలిపారు. నిర్బంధాలు, నియంతృ త్వాలతో కార్మిక వర్గ ఉద్యమాన్ని ఆపలేరని, రాష్ట్ర కార్మిక వర్గ ప్రయోజనాల ధ్యేయంగా సిఐటియు నిరంతరం కార్మిక వర్గ పక్షాన ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం పోరాడు తుందని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో ఉన్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని 26వేల వేతనం ఇవ్వాలని సిఐటియు 18 అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ  కార్యక్రమం తాండూరు మున్సిపల్ వర్కర్స్. యూనియన్ గౌరవ అధ్యక్షులు కే.రాములు.వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్. ప్రకాష్. వెంకటేష్. ఉన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe