సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన తమ్ముడు.. బాధతో ఆగిన అక్క గుండె.

BB6 TELUGU NEWS CHANNEL
సర్పంచ్ బరిలో నిలిచిన తమ్ముడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక అతడి అక్క గుండెపోటుతో చనిపోయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పుర్ గ్రామం లో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన పోతు రాజశేఖర్ సర్పంచ్ పదవి కోసం పోటీ చేశాడు. గురువారం ఎన్నికజరగడంతో రాజశేఖర్ అక్క కొక్కులమమత (38) గంభీర్పూర్ గ్రామానికి వచ్చారు. గురువారం రాత్రి రిజల్ట్ రావడంతో రాజశేఖర్ ఓడిపోయాడు. ఈవిషయాన్ని తట్టుకోలేని అతడి అక్కకు గుండెపోటు రావడంతో కోరుట్లలోని ఓప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe