నన్ను గెలిపిస్తే.. అన్నీ ఫ్రీగా ఇస్తాI..పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర హామీలు

•ఓటర్లను ఆకట్టుకునేలా ఆశావహుల ప్రయత్నాలు

•సొంత మేనిఫెస్టోలు ప్రకటిస్తు బరిలోకి దిగే నేతలు

•వీడియోలు తీసి గ్రామ వాట్సాప్ గృపుల్లో ప్రచారం

ముందే డబ్బు డిపాజిట్ చేయాలని గ్రామ పెద్దలు డిసైడ్ ( డిమాండ్ )

BB6 TELUGU NEWS CHANNEL
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ గా పోటీచేయాలనుకునే ఆశావహులు చిత్ర విచిత్రహామీలు ఇస్తున్నారు. సొంత మేనిఫెస్టోలను ప్రకటించేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అమలు సాధ్యం కాని హామీలతో ఆశావహులు అందరూ ఇదేపంథాను అనుసరిస్తున్నారు. తనను గెలిపిస్తే అన్నీ ఫ్రీ అంటూ ఉచితాలతో ఆకర్షిస్తున్నారు. తనమేనిఫెస్టో ఇదంటూ సోషల్ మీడియా,వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తున్నారు. నేతల హామీలను చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరో వైపు గ్రామపెద్దలు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారం కోసమే ఇలాంటి హామీలు ఇస్తున్నారని పేర్కొంటున్నారు.ఇంటి పన్ను నుంచి సైకిళ్ల పంపిణీ దాకా..

ఖమ్మం జిల్లాలోని సోషల్ మీడియా గ్రూపుల్లో నేలకొండపల్లి మండలానికి చెందిన ఓ ఆశావహుడి మేనిఫెస్టో పోస్ట్వైరల్ గా మారింది. గ్రామంలో కొత్త ఆలయం నిర్మాణానికి ఎకరం భూమి విరాళంగా ఇస్తానని, ఐదేండ్ల పాటు ఇంటి పన్ను, నల్లా బిల్లులు కడతానని హామీ ఇచ్చారు. ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు ఉచిత మందులు పంపిణీ చేస్తానన్నారు.ఏటా ఆలయ ఉత్సవాలకు రూ.50 వేలు ఇస్తానని, వినాయక చవితికి అన్ని ఉత్సవ కమిటీలకు విగ్రహాలు ఫ్రీ అని ప్రకటించారు.మసీదు, చర్చిలకు కూడా ఏటా రూ.50వేలు, ప్రభుత్వ స్కూల్ లో బాగా చదివే విద్యార్థుల్లో క్లాసులో ఇద్దరికి ఏటా రూ.2వేల స్కాలర్షిప్, ఇతర గ్రామాల్లో చదివే 10మంది విద్యార్థులకు సైకిళ్లు ఫ్రీ అంటూ..వరాలు కురిపించాడు.

అన్నీ ఫ్రీగా ఇస్తానని వీడియో రిలీజ్
కుసుమంచి మండలంలోని పంచాయతీకి చెందిన మరో వ్యక్తి కూడా ఇదే ట్రెండ్ఫాలో అయ్యాడు. ఐదేండ్ల పాటు అయ్యప్ప మాలధారులకు నిత్య అన్నదానం,సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలకు రూ.5 వేలు, దసరాకు 100 మంది పేదలకు బట్టలు, ఎంపిక చేసిన 10 మంది పేదమహిళలకు కుట్టు మెషీన్లు, సొంత ఖర్చులతో గ్రంథాలయం నిర్వహణ, వాటర్ప్లాంట్ ఏర్పాటు చేసి మినరల్ వాటర్సప్లయ్ , పెండ్లిళ్లు, జాతరలకు డీజే, మైక్ఫ్రీ ఇస్తానని ప్రకటించారు.
మరణించిన వారికి శవాన్ని భద్రపరిచేందుకు ఫ్రీజర్, స్మశానానికి వైకుంఠ రథం ఇస్తానని హామీ ఇచ్చారు.పేద కుటుంబాల్లో ఆడపిల్ల పెండ్లికి చీర,సారే కానుక, వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ చేస్తానని వీడియో రిలీజ్చేశాడు.

గెలిపిస్తే..ఎలా అమలు చేస్తావు ?
ఇలాంటి ఉచిత హామీలపై గ్రామస్తులు,పెద్దలు కూడా సీరియస్ గా స్పందిస్తున్నారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం స్టేట్ మెంట్లు చేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. టౌన్ లో సెటిల్ అయి సోషల్ మీడియాలో హామీలతో తనకు మద్దతు ఇవ్వాలంటూ ప్రచారం చేస్తున్న నేతలను గ్రామాలకు పిలిపిస్తున్నారు.ఇచ్చిన హామీలను నమ్మి గెలిపిస్తే, ఆతర్వాత వాటిని ఎలా అమలు చేస్తావు..? నీవద్ద ఉన్న డబ్బు ఎంత.? అన్ని ప్రశ్నిస్తున్నారు.

హామీలు అమలు చేసేందుకు అయ్యే ఖర్చు ఎంత..?
వాటిలో 50 శాతం ముందుగా గ్రామ పెద్ద మనుషుల వద్ద డిపాజిట్చేయాలని నిలదీసేందుకు డిసైడ్ అయ్యారు. అప్పుడే నమ్ముతామంటూ స్పష్టంగా సర్పంచ్ పోటీదారుడికి గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe