తెలీదు ,గుర్తు లేదు, మర్చిపోయా విచారణలో ఐబొమ్మ రవిపొంతన లేని సమాధానాలు

BB6 TELUGU NEWS CHANNEL
మూడో రోజు ఐ బొమ్మ రవి కస్టడీ విచారణ ముగిసింది. విచారణలో పోలీసులకు రవి ఏమాత్రం సహకరించడం లేదు. అధికారులు ఏది అడిగినా విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు. పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లు అడిగితే గుర్తు లేదు, మరిచిపోయా అని సమాధానం ఇస్తున్నాడు రవి. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో హార్డ్ డిస్క్ లు, పెన్డ్రైవ్ లు ఓపెన్ చేయిస్తున్నారు పోలీసులు.ఫ్రాన్స్, నెదర్లాండ్స్ లో మెయిన్ సర్వర్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

బ్యాంక్ ఖాతాల వివరాలపైనా కూడా రవి నోర విప్పడం లేదు. రవి అకౌంట్ల చిట్టా ఇవ్వాలని పలు బ్యాంకులకు మెయిల్చేశారు పోలీసులు. ప్రతీ 20 రోజులకు ఒక దేశానికి వెళ్తున్న రవి..విదేశీ పర్యటనలు అంటే ఇష్టంతోనే వెళ్ళానని చెబుతున్నాడు. యూఎస్బీటీ ద్వారా వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేసేవాడని తేలింది. రవి విజిట్చేసిన దేశాల్లో ఉన్న పైరసీ లింకుల గురించి కూపీ లాగుతున్నారు పోలీసులు..

పోలీసుల విచారణలో 21 వేలకు పైగా సినిమాలు రవి పైరసీ చేసినట్లు తేలింది. మూడు దేశాల్లో సర్వర్లు ఏర్పాటు చేసి సినిమాలను పైరసీ చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. రవి కేసును ఇప్పటికే సీసీఎస్ పోలీసులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే..ఈ కేసులో ఇవాళ సీఐడీ ఎంట్రీ ఇచ్చింది.బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుల విచారణ జరుపుతున్న సీఐడీ రవి విషయంలోనూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తోంది. మరో వైపు ఇదే కేసులో నవంబర్ 21న ఈడీ విచారించింది. రవి బ్యాంక్ ఖాతాల్లో రూ.20 కోట్లు, క్రిప్టో ద్వారా నెలకురూ.15లక్షలు జమ అయినట్లు గుర్తించారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe