హైదరాబాదులో అర్ధరాత్రి ఘోరం
చట్నీ మీద పడిందని వ్యక్తిని కిరాతంగా హతమార్చిన యువకులు

రెండు గంటలపాటు కారులో తిప్పుతూ.. సిగరెట్లతో కాల్చుతూ చివరికి కత్తితో కిరాతకంగా హత్య చేసిన నలుగురు యువకులు(ఒక మైనర్)

BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్–నాచారం ప్రాంతంలో అర్ధరాత్రి 2 గంటలకు సరదాగా కారులో తిరుగుతున్న మహమ్మద్ జునైద్(18), షేక్ సైఫుద్దీన్(18), మణికంఠ(21), మరో బాలుడు(16)ను, ఎల్బీ నగర్ వద్ద లిఫ్ట్ అడిగిన ఉప్పల్ ప్రాంతానికి చెందిన మురళి కృష్ణ(45) అనే వ్యక్తి

దారి మధ్యలో ఎన్జీఆర్ఐ ప్రాంతంలో యువకులతో కలిసి టిఫిన్ చేస్తుండగా, ఒక యువకుడిపై అనుకోకుండా చట్నీ పడింది

దీంతో మురళి కృష్ణను కారులో బలవంతంగా ఎక్కించుకుని, నా మీదే చట్నీ పోస్తావా అంటూ, పిడి గుద్దులు గుద్దుతూ నరకం చూపించిన యువకులు

రెండు గంటలు కారులో తిప్పుతూ, సిగరెట్లతో కాల్చుతూ, చివరికి కత్తితో మురళి కృష్ణను పొడిచిన కిరాతకులు

నిందితుల నుండి తప్పించుకునేందుకు, కారు దూకి పారిపోతుండగా, వెంబడించి మరీ హతమార్చిన పోకిరీలు

మురళి కృష్ణ చనిపోయాడని నిర్ధారించుకుని, మార్గ మధ్యలో కత్తి పడేసి, మల్లాపూర్ కేఎల్ రెడ్డి నగర్ ప్రాంతంలో కారు పార్క్ చేసి పారిపోయిన యువకులు

పలు బృందాలుగా ఏర్పడి, నిందితుల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించిన పోలీసులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe