BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిలా తాండూరు అక్టోబర్ 18: తాండూరు పట్టణంలో నిర్వహించిన బీసీ బంద్ లో పాల్గొని, సంపూర్ణ మద్దతు పలికిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
ఎన్నికల వరకే రాజకీయలు, జనాభా పరంగా రిజర్వేషన్స్ ఇవ్వాలనే బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.రాజకీయంగా, విద్యపరంగా, ఉద్యోగపరంగా రిజర్వేషన్స్ కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్స్ సాధనకై మాటలు చెప్పడం కాదు, ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన మాట ప్రకారం దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా కులగణన చేసి చూపించి తెలంగాణ రాష్టాన్ని దేశానికే ఆదర్శంగా చూపించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదని మనమందరం గ్రహించాలి.
రాహుల్ గాంధీ గారు ఇచ్చిన నినాదం ఎవరి వాట వారికీ అనేది ఓ వరం.అందరూ కలిసి రండి, బీసీ రిజర్వేషన్ల కోసం న్యాయపరంగా పోరాటం చేద్దాం.ఎవరి స్వార్థ ప్రయోజనం కోసం వారు ఆలోచించడం కాదు, బీసీ రిజర్వేషన్స్ కోసం నాయకులంతా పార్టీలకు అతీతంగా కృషి చేయాలి.
జనభాలో సగభాగం ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా కేంద్రంలో ఉన్న బిజేపి పార్టీపై మనందరం ఒత్తిడి తేవాలి.
ఇప్పటికే ప్రకటించిన స్థానిక సంస్థల రిజర్వేషన్లో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పరదర్శకంగా జరిగింది.రిజర్వేషన్ల సాధనలో కాంగ్రెస్ పార్టీ అదేశాలతో తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బంద్ లో పాల్గొని సంఘీభావం తెలిపారు.
బీసీ రిజర్వేషన్ సాధనకు పార్టీలకు అతీతంగా పోరాడాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
18
Oct