BB6 TELUGU NEWS CHANNEL
సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత ప్రభుత్వం ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఒకటి 50 శాతం లోపు రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం. రెండోది రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుపై తుది నిర్ణయం తీసుకునే వరకు ఎదురు చూడటం. ఎందుకంటే రిజర్వేషన్ల పెంపునకు అడ్డంకిగా ఉన్న 2018 పంచాయితీరాజ్ చట్టంలోని 285(A) నిబంధనను సవరిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్కు పంపారు. ఆ బిల్లు ఆమోదం కోసం గవర్నర్కు పంపగా, ఆయన రాష్ట్రపతి పరిశీలన కోసం ఢిల్లీకి పంపారు. సుమారు నెల రోజులుగా ఆ బిల్లు ఢిల్లీలోనే పెండింగ్లో ఉంది. దానికి ఎప్పుడు క్లియరెన్స్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్రపతి సైతం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చాన్స్ లేదని లీగల్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందు రెండే ఆప్షన్లు
17
Oct