BB6 TELUGU NEWS CHANNEL
కరీంనగర్ జిల్లాలో అవినీతి అధికారులు పట్టుబడ్డారు. మెడికల్ షాపు లలో తనిఖీలకోసం వచ్చిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికారు.. వివరాల్లోకి
వెళితే..కరీంనగర్ పట్టణంలోని విజేత హాస్పిటల్ మేడికల్ షాపులో మంగళవారం (అక్టోబర్7) తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. షాపునిర్వాహకుడి నుంచి రూ.20వేల లంచం తీసుకుంటుండగా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేస్తున్న డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ మర్యాలశ్రీనివాస్, డ్రగ్ ఇన్ స్పెక్టర్ కార్తీక్ భరద్వాజ్తోపాటు, ప్రైవేట్ పర్సన్ రాము ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు అధికారులు.
ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన డ్రగ్ కంట్రోల్ అధికారులు
08
Oct