అక్టోబర్ 2న జిహెచ్ఎంసి పరిధిలో మాంసం దుకాణాలు బంద్.

BB6 TELUGU NEWS CHANNEL మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ పరిధిలోని పశువులు,గొర్రెలు, మేకల వధశాలలు, అలాగే రిటైల్ మాంసం , బీఫ్ దుకాణాలు మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. జీహెచ్ఎంసీ చట్టం–1955లోని విభాగం 533 (బి) తో పాటు ఈ నెల 24న జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన 172వ తీర్మానం ఆధారంగాఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. ఈఆదేశాల అమలు కోసం సంబంధిత అధికారులందరు సహకరించాలని,మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ చేపట్టి గాంధీ జయంతి పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.
గాంధీ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు, స్లాటర్ హౌస్ లను మూసివేయాలని ఆదేశించిన జిహెచ్ఎంసి కమిషనర్..

జిహెచ్ఎంసి ఆక్ట్ 1955 లోని 533B ప్రకారం స్టాండింగ్ కమిటీ లో ఆమోదం.

ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆర్ వి కర్ణన్..

సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టి సరైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశం..

ఈసారి గాంధీ జయంతి రోజునే దసరా వస్తుండడంతో అయోమయంలో పడ్డ మాంసం విక్రయదారులు..

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe