మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం అశిరెడ్డిపల్లీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం

BB6 TELUGU NEWS CHANNEL
సెప్టెంబర్ 17 వ తేదీ నుండి 16 actober వరకు పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అశిరెడ్డిపల్లీ అంగన్వాడీ కేంద్రం లో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యమం లో జిల్లా శిశు సంక్షేమ అధికారి జరీనా బేగం, MPDO, MEO Gandeed మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, CDPO Radhika, సెక్టార్  supervisor మల్లమ్మ ANM మరియు AWT చందన పాల్గొన్నారు.
DWO జారిన బేగం మాట్లాడుతూ నూనె ,చెక్కర ,ఉప్పు వాడకం తగ్గించేలా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలన్నారు. జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం వస్తుందని ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని తెలిజేశారు. గ్రామం లో ఉన్న అంగన్వాడీ సేవలు వినియోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని జితేందర్ రెడ్డి మాట్లాడారు. MPDO మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం లో అందించే పౌష్టికాహారం అందరూ తీసుకోవాలని సూచించారు. Dr చంద్రశేఖర్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ సరైన ఆహారం తీసుకుంటేనే మంచి ఆరోగ్య సాధ్యమని తెలియజేశారు.  అంగన్వాడీ కేంద్రం లో జరిగే ప్రీ స్కూల్ కార్యక్రమాల వల్ల పిల్లలు  మంచి అలవాట్లు నేర్చుకుంటారు. పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రం పునాది వంటిదని MEO జనార్ధన తెలియజేశారు.

అడ్వర్టైజ్మెంట్
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe