BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామం స్థానిక నలంద విద్యాలయంలో ,డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని స్థానిక నలంద విద్యాలయం వెన్నచెడ్ నందు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గుర్రాల చెన్నయ్య పాఠశాలలోని ఉపాధ్యాయులకు పూలమాల శాలువాలతో సన్మానించి, సమాజంలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర గురించి విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ M మాసయ్య మాట్లాడుతూ ,ఉపాధ్యాయుల యొక్క నైపుణ్యతను సమాజంలో వారికి ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించి మా పాఠశాల ఉపాధ్యాయులకు సన్మానించినటువంటి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గుర్రాల చెన్నయ్య మరియు వారి కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉప ప్రధానాచార్యులు జి సావిత్రితో పాటు మిగతా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు , గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఘనంగా గురుపూజోత్సవం శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా నలంద విద్యాలయంలో ఉపాధ్యాయుల దినోత్సవం.
08
Sep