ఇవాళ (సెప్టెంబర్ 07) యాదగిరిగుట్ట ఆలయం మూసివేత..మధ్యాహ్నం 12 గంటల వరకే దర్శనాలు

BB6 TELUGU NEWS CHANNEL  :
యాదగిరిగుట్ట : సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం (సెప్టెంబర్ 07) మధ్యాహ్నం 12 గంటలకు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసి వేయనున్నారు.మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనానికి అనుమతించి, ఆ తరువాత గుడి మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు
తెలిపారు.

యాదగిరిగుట్ట ఆలయంతో పాటు పాతగుట్ట, ఉప ఆలయాలు, అనుబంధ ఆలయాలన్నింటికీ ద్వార బంధనం చేయనున్నారు. సోమవారం ఉదయం 3:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేయనున్నారు.

స్వామివారికి సుప్రభాతం, తిరువారాధన, బాలబోగం, నిజాభిషేకం,సహస్రనామార్చన నిర్వహించి, ఉదయం 8:15 గంటల నుంచి దర్శనాలుప్రారంభిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆలయ
అధికారులు సూచించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe