జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత రాంపల్లి రేణుకకు సన్మానం

BB6TELUGU NEWS,Narkatpalli ఉబ్బని శేఖర్ : మండల పరిధిలోని తొండలవాయి గ్రామంలో పనిచేస్తున్న రాంపల్లి రేణుకకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు రావడం పట్ల తొండలవాయి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉపసర్పంచ్ చింత సుధాకర్ పాల్గొని మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన రేణుక గారిని శాలువాతో సన్మానించి మన తొండలవాయి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలికి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు రావడం చాలా సంతోషం ఇంకా మరెన్నో అవార్డులు అందుకోవాలని మన గ్రామం పేరు రాక్షసయలు తీసుకుపోవాలని అదేవిధంగా విద్యార్థులను మంచి ఉన్నత స్థానాలకు తీసుకపోయే విధంగా విద్యను అందించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల మాజీ చైర్మన్ బెల్లి ఎర్రగోపాల్ యువ నాయకులు చింతా విక్రం, రాము, ఉపాధ్యాయులు సత్తిరెడ్డి, అయేషా, విజయలక్ష్మి, కృష్ణ, సైదులు, రమాదేవి, రుక్సానా, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe