ప్రశాంతి నగర్‌లో సబ్ రేషన్ షాప్ ప్రారంభం. ప్రజల ముంగిట కాంగ్రెస్ సంక్షేమం.ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

BB6 TELUGU NEWS CHANNEL  : Tirupati  : రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు స్థానిక 5వ డివిజన్ ప్రశాంతి నగర్‌లో నూతన సబ్ రేషన్ షాపును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ – “కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అర్హులైన నిరుపేదల పక్షాన నిలబడింది. ఉచిత వైద్యం కోసం ‘ఆరోగ్య శ్రీ’, పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’, పేద వృద్ధులు, వికలాంగుల కోసం ‘పెన్షన్ పథకాలు’, ప్రతి ఇంటికి ‘గృహ జ్యోతి’, రైతులకు ‘రైతు రుణ మాఫీ’, ఇల్లు లేని వారికి ‘ఇందిరమ్మ ఇళ్ళు’ వంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఈ పథకాలన్నీ మళ్లీ బలంగా ప్రజలకు చేరేలా కృషి చేస్తాం” అని తెలిపారు.

అదే విధంగా ఆయన మాట్లాడుతూ – “ప్రశాంతి నగర్ ప్రజల సౌకర్యార్థం కొత్త సబ్ రేషన్ షాప్‌ను ఏర్పాటు చేసాం. రామగుండం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఎటువంటి దళారులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా మేము కట్టుబడి ఉన్నాం” అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని అభినందించారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe