BB6 TELUGU NEWS CHANNEL : Ravikumar : నల్గొండ: రూ.20 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారిణి చరితా రెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఫిషరీస్కో-ఆపరేటివ్ సొసైటీలో నూతన సభ్యులను చేర్చుకునేందుకు వీలుగా అనుమతిచ్చేందుకు ఆమె లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కారు. నగదును రికవరీ చేసుకున్న పోలీసులు,ఆమెపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆమె నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు.
కలెక్టరేట్‌లో కలకలం.. రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన అధికారిణి
05
Sep